ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 28.03.2025 శుక్రవారానికి సంబంధించినవి.
బంధువులతో మనస్పర్థలు వస్తాయి. అప్పుల ఒత్తిడి వల్ల బాధలు తప్పవు. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వ్యాపార, ఉద్యోగాలు నెమ్మదిస్తాయి.
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కష్టం తప్ప ఫలితం దక్కదు. ఆకస్మిక ప్రయాణాలు చేయచ్చు. వ్యాపార, ఉద్యోగాల్లో ఇబ్బందులు పెరుగుతాయి.
చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగవచ్చు. చేపట్టిన పనుల్లో విజయం దక్కుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభదాయకం.
ఆర్థిక ఇబ్బందులు చికాకు తెప్పిస్తాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు సాధారణం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
కుటుంబ సభ్యులతో శుభకార్యలకు వెళ్తారు. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్ కు బాగా ఉపయోగపడతాయి. విలువైన వస్తువులు కొంటారు. పిల్లల చదువు, ఉద్యోగం విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
ఉద్యోగంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలం. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు తప్పవు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
వ్యాపారంలో సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. ఆకస్మిక ధన లాభం కలుగవచ్చు. ఉద్యోగంలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు.
ఉద్యోగంలో ప్రతిభకు తగ్గ గుర్తింపు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ఇంటి నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.
బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వృథా ఖర్చులు పెరుగుతాయి.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని సమస్యలు చికాకు తెప్పిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రమే.
ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయ సభ, సమావేశాల్లో పాల్గొంటారు. కొన్ని రుణాలు తీరుతాయి. వ్యాపారాలు అనుకూలం. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి.
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆప్తుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో ఫలితం దక్కుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.