ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 27.03.2025 గురువారానికి సంబంధించినవి.
విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాల్లో ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నూతన ప్రోత్సహకాలు అందుతాయి.
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
చేపట్టిన పనుల్లో ఫలితం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. విందు వినోదాలకు ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు అంతంతమాత్రమే. వ్యాపార, ఉద్యోగాల్లో నిరాశ తప్పదు. కొన్ని పనుల్లో శ్రమ తప్ప ఫలితం దక్కదు.
వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
దైవచింతన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు వస్తాయి. సోదరులతో అకారణంగా వివాదాలు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత చికాకు తెప్పిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మిత్రులతో మాటపట్టింపులు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. దూర ప్రయాణాలు లాభదాయకం. పనులు అధిక శ్రమతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
ఆప్తుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పని ఒత్తిడి నుంచి ఉపశమనం దక్కుతుంది. పిల్లల గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు కొంటారు. ప్రముఖుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం.
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నూతన ప్రయత్నాలు కలిసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాల్లో ఊహించని ఇబ్బందులు వస్తాయి.