ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 26.03.2025 బుధవారానికి సంబంధించినవి.
తల్లి తరఫు బంధువులతో అకారణంగా వివాదాలు వస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి.
అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం తప్పదు. ఆరోగ్యం విషయంలో డాక్టర్ ను కలవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.
స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలం. ఆప్తులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. పనులు పూర్తికాక చికాకు వస్తుంది. ఆప్తులతో అకారణంగా విభేదాలు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. అప్పుల బాధ నుంచి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం.
విలువైన వస్తువులు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు.
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది.
చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమ తప్పా ఫలితం దక్కదు. అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.
శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన పనులు ఆశించిన విధంగా ఉంటాయి. ఇంట్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.
ఆర్థిక ఇబ్బందుల వల్ల కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు వస్తాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కలిసిరాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.