ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 25.03.2025 మంగళవారానికి సంబంధించినవి.
ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహకారంతో పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు కలిసివస్తాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు వస్తాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాల వల్ల శ్రమ పెరుగుతుంది.
నిరుద్యోగులకు అనుకూలం. పిల్లలకు సంబంధించిన శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. పాత రుణాలు తీరుస్తారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకం.
భాగస్వామ్య వ్యాపారాలు నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందదు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు దక్కదు. నిరుద్యోగులు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం మంచిది.
దూర ప్రాంతాల నుంచి ఆసక్తికర సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలం. కొన్ని వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగం విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. భూ క్రయ విక్రయాలు లాభదాయకం.
పిల్లల చదువు, ఉద్యోగం విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. బంధుమిత్రుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకం.
ఉద్యోగంలో అధికారులతో అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. భూ క్రయవిక్రయాల్లో తొందరపాటు మంచిది కాదు. మిత్రులతో అకారణంగా వివాదాలు వస్తాయి. ప్రశాంతత లోపిస్తుంది.
విలువైన వస్తువులు కొంటారు. అప్పుల ఒత్తిడి నుంచి బయట పడతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలం. వ్యాపారాలు లాభదాయకం.
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలం. జీవిత భాగస్వామి సలహాతో కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆప్తుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.
దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు అనుకూలం. పిల్లల ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్త అవసరం. కొత్త వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు వస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన బాధిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి.