Today Rasi Phalalu: ఈ రాశుల వారికి బంధు మిత్రులతో గొడవలు తప్పదు...!

Published : Mar 24, 2025, 05:00 AM IST
Today Rasi Phalalu: ఈ రాశుల వారికి బంధు మిత్రులతో గొడవలు తప్పదు...!

సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 24.03.2025 సోమవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇంటా బయట ఊహించని సమస్యలు వస్తాయి.

వృషభ రాశి ఫలాలు

అప్పుల ఒత్తిడి నుంచి బయటపడతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

మిథున రాశి ఫలాలు

ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో అకారణంగా వివాదాలు వస్తాయి.

కర్కాటక రాశి ఫలాలు

పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వింటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. బంధు, మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

కన్య రాశి ఫలాలు

కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగంలో చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. బంధుమిత్రులతో ఊహించని విధంగా మనస్పర్థలు వస్తాయి.

తులా రాశి ఫలాలు

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  నిరుద్యోగులకు కలిసిరాదు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాల్లో చిన్నపాటి వివాదాలు వస్తాయి.

వృశ్చిక రాశి ఫలాలు

కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. సమాజంలో విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.

ధనస్సు రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు అనుకూలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి.

మకర రాశి ఫలాలు

వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ వాతావరణం ఉంటుంది. బంధువులతో విభేదాలు వస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.

కుంభ రాశి ఫలాలు

వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కలిసిరాదు. రుణ ఒత్తిడి పెరుగుతుంది. సన్నిహితులతో స్వల్ప వివాదాలు వస్తాయి.

మీన రాశి ఫలాలు

ఉద్యోగులు జీతభత్యాల విషయంలో శుభవార్తలు వింటారు. ప్రముఖుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పనులు వేగంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Today Rasi Phalalu: నేడు ఓ రాశివారికి అదృష్టయోగం, పట్టిందల్లా బంగారమే!
Astrology Predictions: ఈ 6 రాశులవారికి రాజయోగం.. ఆరు నెలల వరకు డబ్బే డబ్బు!