ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 02.04.2025 బుధవారానికి సంబంధించినవి.
ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి బయటపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆర్థిక వ్యవహారాల్లో నిరాశ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పిల్లల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారం, ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు వస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. నిరుద్యోగులకు కలిసిరాదు.
సోదరుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సలహాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. కొత్తగా రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వాములతో గొడవలు తప్పవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వల్ల ప్రశాంతత ఉండదు.
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి డబ్బు సాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.
అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు వస్తాయి. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
ప్రయాణాల్లో కొత్త పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
జీవిత భాగస్వామితో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.
కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువులతో మాట పట్టింపులు వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడుల విషయంలో తొందరపాటు మంచిది కాదు. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు విఫలం అవుతాయి.
ఆర్థికంగా అనుకూలం. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. ఇంటాబయట అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది.