ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 01.04.2025 మంగళవారానికి సంబంధించినవి.
ప్రముఖుల పరిచయాలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది.
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఇంటా బయట బాధ్యతలు చికాకు తెప్పిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. కీలక వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు.
తల్లి తరఫు బంధువులతో స్థిరాస్తి వివాదాలు తప్పవు. చేపట్టిన పనుల్లో శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు వస్తాయి. ఉద్యోగాల్లో వివాదాలు తప్పవు. దూర ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి. మిత్రులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. వ్యాపారాలు అనుకూలం. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.
వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో విఫలం అవుతారు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. అన్నదమ్ములతో భూ సంబంధిత వివాదాలు చికాకు తెప్పిస్తాయి. ఆర్థికంగా అంతత మాత్రమే. కంటి సంబంధిత సమస్యలు బాధిస్తాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఇంట్లో దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థికంగా ఆశాజనకం. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరుతాయి.
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాల వల్ల నష్టాలు తప్పవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. ఆరోగ్యం విషయంలో ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుంది.
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో ఫలితం దక్కుతుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలు అనుకూలం.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంట్లో వివాహ సంబంధిత విషయాలపై చర్చలు జరుగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవపై దృష్టి సారిస్తారు. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మంచిది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పని భారం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి.
బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. దూర ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగంలో సమస్యలు ఎదురవుతాయి.
స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్లు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి సాయం అందుతుంది. పిల్లల చదువు, ఉద్యోగం అనుకూలం. దైవ చింతన పెరుగుతుంది.