Vastu tips: ఈ 5 ప్రదేశాల్లో భోజనం చేయడం అస్సలు మంచిది కాదు! ఎందుకో తెలుసా?

Published : Jun 22, 2025, 04:06 PM IST
Vastu tips: ఈ 5 ప్రదేశాల్లో భోజనం చేయడం అస్సలు మంచిది కాదు! ఎందుకో తెలుసా?

సారాంశం

హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు రావని చాలామంది నమ్ముతారు. కొన్నిచోట్ల భోజనం చేయడం వల్ల పేదరికం తప్పదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మరి ఎక్కడ భోజనం చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం. 

హిందూ సంస్కృతిలో వాస్తు శాస్త్రం ముఖ్యమైన భాగం. ఇళ్లు.. ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం ఉంటే ప్రతికూల శక్తుల ప్రభావం పడకుండా ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఎంత సాంకేతికత అందుబాటులోకి వచ్చినా.. ఇప్పటికీ వాస్తుశాస్త్రాన్ని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. కొత్త ఇళ్లు కట్టుకున్నా లేదా స్థలం కొనాలన్నా, ఇంకా ఏ కొత్త పనిచేసినా వాస్తు నిపుణులను సంప్రదించి.. వారి సలహా ప్రకారమే నడుచుకుంటారు.

వాస్తు శాస్త్రంలోని కొన్ని అంశాలను గుర్తుంచుకోవడం ద్వారా.. జీవితాన్ని కాస్త సులభతరం చేసుకోవచ్చని చాలామంది నమ్ముతారు. వాస్తు శాస్త్రం.. ఇంట్లో ఏ వస్తువులను ఏ దిశలో ఉంచుకోవాలో మాత్రమే కాదు.. తినే ఆహారం విషయంలోనూ కొన్ని సూచనలు చేసింది. వాస్తు ప్రకారం కొన్ని చోట్ల భోజనం చేస్తే.. అస్సలు మంచిది కాదట. అలా తింటే పేదరికం తప్పదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రదేశాలేంటో ఓసారి తెలుసుకుందామా…  

వాస్తు ప్రకారం భోజనం చేయకూడని ప్రదేశాలు

గడప దగ్గర భోజనం చేయకండి!

గడప దగ్గర లేదా మెట్టు దగ్గర కూర్చొని భోజనం చేయడం చాలా అశుభం అని వాస్తు శాస్త్రంలో స్పష్టంగా ఉంది. తెలిసో.. తెలియకో ఈ తప్పు చేస్తుంటే.. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రదేశంలో భోజనం చేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందట. ఈ ప్రదేశం దేవుడి నివాసంగా చెబుతారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుందట. కాబట్టి గడప దగ్గర లేదా మెట్ల దగ్గర భోజనం చేయకూడదు. దీనివల్ల డబ్బు పోయే అవకాశం ఎక్కువ ఉందట. 

పూజ స్థలాల దగ్గర భోజనం చేయకండి!

సాధారణంగా చాలామంది పూజ స్థలం దగ్గర కూర్చొని భోజనం చేస్తే మంచిది అనుకుంటారు. కానీ వాస్తు ప్రకారం అలా చేయడం అశుభంగా భావిస్తారు. పూజ స్థలం దగ్గర భోజనం చేయడం వల్ల మీరు దేవుళ్లను అవమానించినట్లు అవుతుందట. మీరు ఇలా చేస్తుంటే, దాన్ని మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి, సంతోషం దెబ్బతింటాయట. సంతోషం, సంపద కూడా దూరమవుతాయట.

సోఫా మీద కూర్చొని ఎప్పుడూ భోజనం చేయకండి.

చాలామంది సోఫా మీద కూర్చొని భోజనం చేస్తుంటారు. మీరు కూడా అలా సోఫా మీద కూర్చొని హాయిగా భోజనం చేస్తుంటే.. వెంటనే దాన్ని మానేయండి. వాస్తు ప్రకారం ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందట. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుందట. ఇలా చేయడం వల్ల డబ్బు నష్టం జరుగుతుందట. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందట.

మురికి ప్రదేశంలో భోజనం చేయకండి.

ఆరోగ్యకరమైన ఆహారం తినడం మాత్రమే కాదు.. తినే ప్రదేశం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అటు వాస్తు శాస్త్రం కూడా ఇదే చెబుతోంది. తినడానికి ఎప్పుడైనా శుభ్రమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. మీరు మురికి ప్రదేశంలో కూర్చొని భోజనం చేస్తే.. మీ చుట్టూ ప్రతికూల శక్తి ఉంటుంది. అంతేకాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడు భోజనం చేసినా.. శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని మాత్రమే చేయాలని వాస్తుశాస్త్రం చెబుతోంది.

గ్యాస్ స్టవ్ దగ్గర భోజనం చేయకండి.

చాలాసార్లు చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర తింటూ ఉంటారు. ఆత్రుతతో లేదా తెలిసో తెలియకో గ్యాస్ స్టవ్ దగ్గర భోజనం చేయడం మొదలుపెడతారు. అలా అస్సలు చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీరు కూడా అలాంటి ప్రదేశంలో కూర్చొని భోజనం చేస్తే.. ఇంట్లో శాంతి, ప్రశాంతత కరవుతుందట. ముఖ్యంగా పేదరికం వచ్చే అవకాశం ఉందట. కాబట్టి వాస్తును పాటించే వారు ఇలాంటి చోట్ల భోజనం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక

ఈ సమాచారం.. పాఠకుల ఆసక్తి మేరకు.. ఇంటర్నెట్, నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించింది మాత్రమే.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gemini Horoscope 2026: మిథున రాశివారి కెరీర్ లో ఊహించని మార్పులు, 2026 ఎలా ఉండనుంది?
2026లో మేషరాశి వారికి ఎలా ఉంటుంది?