ఈవీఎంలపై వ్యాఖ్య: కేటీఆర్‌కు చంద్రబాబు కౌంటర్

By narsimha lodeFirst Published Apr 15, 2019, 2:46 PM IST
Highlights

2014 ఎన్నికల్లో కూడ తాను ఈవీఎంల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. 
 

అమరావతి: 2014 ఎన్నికల్లో కూడ తాను ఈవీఎంల తీరుపై అనుమానాలు వ్యక్తం చేశానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుర్తు చేశారు. 

సోమవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో తాను గెలిస్తే  ఈవీఎంలు భేష్ అంటూ... ఓడిపోతామని అనుమానం వస్తే  ఈవీఎంలపై నెపాన్ని నెట్టేందుకు తాను ప్రయత్నిస్తున్నానని టీఆర్ఎష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు స్పందించారు.

రాష్ట్రంలో ఈవీఎంలలో లోపాలు చోటు చేసుకొంటే ఎందుకు కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు వచ్చిన ఓటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనేందుకు వచ్చిన ఓటర్లకు ఈసీ కనీస సౌకర్యాలు కూడ కల్పించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో వచ్చిన ఓటర్లకు ఎంత చేసినా కూడ తక్కువేనని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

నేనేం భయపడడం లేదు: ఫలితాలపై చంద్రబాబు

ఎలాంటి ఈవీఎంనైనా ట్యాంపరింగ్ చేయొచ్చు: హరిప్రసాద్

వంగి వంగి దండాలు పెట్టినప్పుడే తేలింది: బాబుపై కేటీఆర్ సెటైర్లు

ఏపీలో మాదే అధికారం, తెలంగాణలో ఇలా చేశారు: బాబు వ్యాఖ్యలు

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

 

click me!