ప్రచారం ఆపాలని డాక్టర్ల సూచన, ఆపనన్న పవన్: సినీ నటుడు రామ్ చరణ్

By narsimha lodeFirst Published Apr 7, 2019, 4:33 PM IST
Highlights

ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా నిలిపివేయాలని వైద్యులు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌కు సూచించారని సినీ నటుడు రామ్‌చరణ్ ప్రకటించారు. కానీ, ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారని ఆయన ప్రకటించారు.

విజయవాడ: ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా నిలిపివేయాలని వైద్యులు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌‌కు సూచించారని సినీ నటుడు రామ్‌చరణ్ ప్రకటించారు. కానీ, ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకొన్నారని ఆయన ప్రకటించారు.

 ఈ మేరకు రామ్ చరణ్ ఫేస్‌బుక్‌లో  జనసేన చీఫ్ పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఆదివారం నాడు విజయవాడలో పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆయనను కలుసుకొన్నట్టుగా ఆయన వివరించారు. పవన్ కళ్యాణ్  చాలా నీరసంగా ఉన్నారని ఆయన వివరించారు.

ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజుల పాటు మాత్రమే సమయం ఉన్న కారణంతో పాటు పొలిటికల్ కమిట్‌మెంట్ కారణంగా డాక్టర్లు ఇచ్చిన సలహాను కూడ వదిలేసి ఇవాళ పెందుర్తి, అనకాపల్లిలో నిర్వహించే ఎన్నికల సభల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకొన్నారని ఆయన ప్రకటించారు.

పవన్‌తో పాటు డాక్టర్ల బృందం పర్యటిస్తామని కోరారు. అయితే డాక్టర్లను రావొద్దని పవన్ కళ్యాణ్ కోరాడు. త్వరగా పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఆయన ఆకాంక్షను వ్యక్తం చేశారు.అంతేకాదు ప్రజలకు  సేవ చేయాలనే పవన్ కోరిక విజయవంతం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

పవన్‌కళ్యాణ్‌కు అస్వస్థత: ఆసుపత్రికి తరలింపు
వేదికపై కిందపడిపోయిన పవన్ కళ్యాణ్

click me!