ప్రచారంలో నందమూరి, నారా కుటుంబ సభ్యుల బిజీ బిజీ

Published : Apr 07, 2019, 02:47 PM IST
ప్రచారంలో నందమూరి, నారా కుటుంబ సభ్యుల బిజీ బిజీ

సారాంశం

ఏపీ ఎన్నికల్లో  టీడీపీ తరపున నందమూరి, నారా కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నాడు నందిగామలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు ఆయన కోడలు నారా బ్రహ్మణి, మనమడు దేవాన్ష్ కూడ పాల్గొన్నారు.


అమరావతి: ఏపీ ఎన్నికల్లో  టీడీపీ తరపున నందమూరి, నారా కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నాడు నందిగామలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు ఆయన కోడలు నారా బ్రహ్మణి, మనమడు దేవాన్ష్ కూడ పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారానికి రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ రెండు రోజుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయా పార్టీలు ప్లాన్ చేసుకొంటున్నాయి. దీంతో  టీడీపీ తరపున ప్రచారం కోసం నందమూరి, నారా కుటుంబ సభ్యులు కూడ విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

టీడీపీ తరపున మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని దుగ్గిరాలలో లోకేష్ తరపున నారా బ్రహ్మణి ఆదివారం నాడు ప్రచారం నిర్వహించనున్నారు. కుప్పంలో చంద్రబాబునాయుడు తరపున ఆయన సతీమణి భువనేశ్వరీ ప్రచార బాధ్యతలను తీసుకొన్నారు.

హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ తరపున ఆయన భార్య వసుంధరాదేవి ప్రచారం నిర్వహిస్తున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి  ముందు నుండే ఆమె హిందూపురంలో మకాం వేశారు.

విశాఖ ఎంపీ స్థానం నుండి శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. శ్రీభరత్ బాలకృష్ణ చిన్న అల్లుడు. దీంతో బాలకృష్ణ కూడ ఇదే నియోజకవర్గంలో అల్లుడు శ్రీభరత్ గెలుపు కోసం శనివారం నాడు ప్రచారం నిర్వహించారు. శ్రీభరత్ తరపున ఆయన సతీమణి తేజస్విని కూడ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్
బయటపడ్డావు, తాటతీస్తా: కేసీఆర్‌కు బాబు వార్నింగ్