ప్రగల్బాలు పలికాడు, బీజేపీ క్లాస్.. తెలివిలోకి వచ్చాడు: పవన్‌పై విజయసాయి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 23, 2020, 2:34 PM IST
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం వరుస ట్వీట్లలో ఇద్దరు నేతలపై సెటైర్లు వేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం వరుస ట్వీట్లలో ఇద్దరు నేతలపై సెటైర్లు వేశారు. 

బెజవాడ రౌడీలా ప్రవర్తించి పార్టీకి మంచి పేరు తెచ్చావని 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఒక ఎమ్మెల్సీని మెచ్చుకుని తన స్వభావాన్ని బయట పెట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తులు రాష్ట్రానికి ఎంత ప్రమాదకారులో ప్రజలకు పూర్తిగా తెలిసిపోయింది. తన మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు.’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

Also Read:తప్పేమిటి: హెరిటేజ్ పై చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు

దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బీజేపీ పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు.

యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు. రాజధాని అనే 10 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం చంద్రబాబు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధమే. విలువలు, సిద్ధాంతాలు లేని వ్యక్తులు వ్యవస్థలన్నిటిని బలి తీసుకుంటారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా  ఇలాగే సాగింది. దానికి ఫుల్ స్టాప్ పడిందన్న విషయం తెలుసుకోలేకపోవడం విషాదం.’ అని విజయసాయి రెడ్డి ధ‍్వజమెత్తారు

Also Read:సీనియర్లతో జగన్ మంతనాలు: శాసనమండలి రద్దు దిశగా ప్లాన్?

కాగా ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ తన విచక్షణాధికారంతో సెలక్ట్ కమిటీకి పంపడంతో వైసీపీ నేతలు మండిపడ్డారు. కౌన్సిల్ నిరవధిక వాయిదాపడిన వెంటనే మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ మీడియా పాయింట్‌లో చంద్రబాబుతో పాటు మండలి ఛైర్మన్ షరీఫ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

దత్త పుత్రుడు తన అజ్ఞానాన్ని పదేపదే బయట పెట్టుకుంటున్నాడు. రాజధాని మారిస్తే ప్రభుత్వాన్ని కూలుస్తానని ప్రగల్భాలు పలికిన వెంటనే బిజెపి పెద్దలు క్లాస్ పీకినట్టున్నారు. తెలివిలోకి వచ్చి రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ఒప్పుకున్నాడు. యూ-టర్నుల్లో యజమానిని మించి పోయాడు.

— Vijayasai Reddy V (@VSReddy_MP)
click me!