అందుకే శాసన మండలి రద్దు ఆలోచన: బొత్స సంచలనం

By narsimha lode  |  First Published Jan 23, 2020, 1:42 PM IST

ఏపీ శాసనమండలి ఛైర్మెన్ పై మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 


అమరావతి: ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ప్రవర్తించారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.చంద్రబాబునాయుడు తన తన తొత్తులను తీసుకొచ్చి కీలకమైన పదవుల్లో కూర్చొబెట్టారన్నారు. ఈ కారణాలతోనే మండలిని రద్దు చేయాలనే ఆలోచన వస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

also read: సీనియర్లతో జగన్ మంతనాలు: శాసనమండలి రద్దు దిశగా ప్లాన్?

Latest Videos

గురువారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌లో  మీడియాతో మాట్లాడారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరు అప్రజాస్వామికంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని మండలి ఛైర్మెన్ తీసుకొన్న నిర్ణయం దురదృష్టకరమని బొత్స సత్యనారాయణ విమర్శించారు.  రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

 మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అనకూడని మాటలు అన్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు.  తన తొత్తులు, అనర్హులకు చంద్రబాబునాయుడు పదవులు కేటాయించారని మంత్రి బొత్స  సత్యనారాయణ విమర్శించారు.

 తనతో పాటు తమ పార్టీకి చెందిన సభ్యులు, మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడులకు పాల్పడేందుకు యత్నించారని మంత్రి  బొత్స సత్యనారాయణ చెప్పారు. మండలి ఛైర్మెన్ షరీప్ వ్యవహరించిన తీరు అనైతికమన్నారు.

అసెంబ్లీ ఆమోదించిన బిల్లును  శాసనమండలి ఆపే అవకాశం ఉందా  మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు శాసనమండలి గ్యాలరీలో కూర్చొని  తన కనుసన్నల్లో శాసనమండలి జరిగేలా చూశారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు.చంద్రబాబు చెప్పినట్టుగానే శాసనమండలి ఛైర్మెన్ వ్యవహరించారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.

బిల్లును ప్రతిపాదించినప్పుడు సవరణలను ఎందుకు టీడీపీ కోరలేదో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా కూడ తమ విధానం సరైంది కాదని మంత్రి చెప్పారు.

ఛైర్మెన్ తన విచక్షణ అధికారాన్ని వినియోగించాల్సింది ఈ బిల్లుపై కాదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. పీడీఎఫ్, ఇండిపెండెంట్, బీజేపీ, వైసీపీ, టీడీపీకి చెంది ఇద్దరు ఎమ్మెల్సీలు సెలెక్ట్ కమిటీకి పంపకూడదని కోరారు.  

అయినా కూడ ఛైర్మెన్ ఎందుకు ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారో చెప్పాలని బొత్స సత్యనారాయణ కోరారు. శాసనమండలిలో సగం మంది ఎమ్మెల్సీలు వ్యతిరేకించినా సెలెక్ట్ కమిటీకి ఎందుకు పంపాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.రాజ్యాంగంపై, చట్టంపై విలువలు లేని వ్యక్తుల్ని శాసనమండలిలో కూర్చోంటే ఏం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 

ప్రజలతో సంబంధం లేని వ్యక్తులను తాబేదార్లను ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెడితే ఏం జరుగుతోందో ప్రజల్లో  చర్చ జరగాల్సిన అవసరం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. 


 

click me!