బాగా చదువుకున్నోళ్లకు ప్రత్యేక చట్టాలు ఉండవు : సుధాకర్ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published May 31, 2020, 3:04 PM IST
Highlights

డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద తాగి తందనాలు ఆడితే వెసులుబాటు ఎలా ఇస్తారని సిదిరి అప్పలరాజు అన్నారు. ఉన్నత విద్యావంతులకు ప్రత్యేక చట్టాలు లేవని ఆయన తేల్చిచెప్పారు.

డాక్టర్ సుధాకర్ రోడ్డు మీద తాగి తందనాలు ఆడితే వెసులుబాటు ఎలా ఇస్తారని సిదిరి అప్పలరాజు అన్నారు. ఉన్నత విద్యావంతులకు ప్రత్యేక చట్టాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్‌ను కొనసాగించాలని చంద్రబాబుకు ఎందుకు అంత ఆత్రమని ప్రశ్నించారు పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు అన్నారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిపాలనలో వేగవంతమైన సంస్కరణలు తీసుకొస్తున్నామని అప్పలరాజు అన్నారు. ఎన్నికల కమీషన్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జిని తీసుకోవాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు ఉండాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Also Read:ట్విస్ట్:డాక్టర్ సుధాకర్‌ చికిత్సకు మాధవీలత నియామకం, రాంరెడ్డి ఔట్

ప్రతిపక్షనేత చంద్రబాబుకి రాజ్యాంగం మీద నమ్మకం లేదని సిదిరి అన్నారు. నిమ్మగడ్డ ను ఎస్.ఇ.సి గా చంద్రబాబు కేబినెట్ గవర్నర్‌కి ఎలా సిఫారసు చేసిందని ఆయన ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలను కాలరాసే విధంగా చంద్రబాబు వ్యవహరించారని అప్పలరాజు మండిపడ్డారు. వైసీపీ ప్రజలు ఆదరించారని.. కానీ కోర్టు, చట్టాల లొసుగులను అడ్డంపెట్టుకొని ప్రతిపక్షాలు ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

Also Read:డా. సుధాకర్ ఇష్యూ: రంగంలోకి సిబిఐ, పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు

కోర్టులను తప్పు పట్టారని 49 మందికి నోటీస్‌లు ఇచ్చారని... కోర్టులు పరిధి దాటితే 4 కోట్ల మంది విమర్శించే పరిస్ధితి వస్తుందని సిదిరి గుర్తుచేశారు. లెజిస్లేటివ్ నిర్ణయాల్లో జ్యూడిషీయల్ వ్యవస్ధ చొరబాటుపై చర్చ జరుగుతుందని అప్పలరాజు అన్నారు. 

click me!