విదేశాలు, ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి: రాష్ట్రంలో 3042కి చేరిన కరోనా కేసులు

Published : May 31, 2020, 02:25 PM ISTUpdated : May 31, 2020, 02:26 PM IST
విదేశాలు, ఇతర రాష్ట్రాల నుండి ఏపీకి: రాష్ట్రంలో 3042కి చేరిన కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 98 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3042కి చేరుకొన్నాయి.  

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 98 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 3042కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో 9370 శాంపిల్స్ పరీక్షిస్తే 98 మందికి కరోనా సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మరణించారు. ఒక్క రోజులో 43 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

also read:జూన్ 8 నుండి భక్తులకు తిరుమల వెంకన్న దర్శనం?

రాష్ట్రంలో నమోదైన 3042 కేసుల్లో 2135 మంది కోలుకొని ఇంటికి వెళ్లినట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కరోనాతో 62 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాతో 845 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

 

ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన 418 మందికి కరోనా సోకిందని ప్రభుత్వం ప్రకటించింది. విదేశాల నుండి వచ్చిన 111 మందికి కూడ కరోనా సోకిందని ప్రభుత్వం తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?