లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్: నందిగామలో చంద్రబాబుపై కేసు

Published : May 31, 2020, 02:09 PM IST
లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్: నందిగామలో చంద్రబాబుపై కేసు

సారాంశం

టీడీపీ చీఫ్ చంద్రబాబుపై నందిగామ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైద్రాబాద్ నుండి ఏపీ రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయంలో చంద్రబాబునాయడు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

విజయవాడ: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై నందిగామ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హైద్రాబాద్ నుండి ఏపీ రాష్ట్రంలోకి అడుగుపెట్టే సమయంలో చంద్రబాబునాయడు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని లాయర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

రెండు నెలల తర్వాత చంద్రబాబునాయుడు ఈ నెల 25వ తేదీన చంద్రబాబునాయుడు హైద్రాబాద్ నుండి ఏపీ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. మార్చి 22వ తేదీన చంద్రబాబునాయుడు ఏపీ నుండి తెలంగాణలోని హైద్రాబాద్ కు చేరుకొన్నాడు.

లాక్ డౌన్ విధించడంతో చంద్రబాబునాయుడు ఆయన తనయుడు హైద్రాబాద్ లోనే ఉన్నారు. నాలుగో విడత లాక్ డౌన్ మినహాయింపులో భాగంగా  ఈ నెల 25వ తేదీన చంద్రబాబు, లోకేష్ లు ఏపీలోకి అడుగుపెట్టారు. 

also read:విధానపరమైన నిర్ణయం వల్లే నిమ్మగడ్డ రమేష్‌ పదవిని కోల్పోయాడు: మంత్రి బొత్స

జగ్గయ్యపేట, కంచికచర్లలలో లాక్ డౌన్ నిబంధనలకు విరుద్దంగా జనసమీకరణకు చంద్రబాబునాయుడు కారణమయ్యారని లాయర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబుపై ఐపీసీ 188 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఏపీ రాష్ట్రంలో అడుగుపెట్టే సమయంలో ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కోదాడతో పాటు ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని హైకోర్టులో పిల్ కూడ దాఖలైన విషయం తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu