
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు , వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఏం చేశామో చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఏమీ చేయలేకపోయామని తనను తాను తిట్టుకోవాల్సిన చంద్రబాబు.. ప్రజలకు మంచి చేస్తున్న జగన్‌ను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అందజేస్తున్న సంక్షేమ పథకాలతో ఏపీ మరో శ్రీలంక అవుతుందని గగ్గోలు పెట్టి.. ఎన్నికలు రాగానే ఫ్రీ స్కీమ్‌లు ప్రకటిస్తున్నారని సజ్జల చురకలంటించారు.
జగన్ రూపాయి ఇస్తే.. తాము రూ.100 ఇస్తామని హామీలు ఇస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో విజయవాడ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. నాశనం చేయడంలో చంద్రబాబుకు వరల్డ్ రికార్డ్ ఇవ్వొచ్చుంటూ సజ్జల సెటైర్లు వేశారు. చంద్రబాబును మించిన 420 మరొకరు వుండరని.. అమరావతి పేరుతో 3 వేల ఎకరాలు జేబులో పెట్టుకున్నారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జనాన్ని ముంచే రియల్టర్‌గా చంద్రబాబు మారారని .. ఆయన హాయంలో ప్రజల జీవితాలను చీకటిమయం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, ఆయన బ్రోకర్ల కోసం కృష్ణా జిల్లాను తాకట్టు పెట్టారని సజ్జల ఆరోపించారు.
ALso Read: ఓ తల్లి బాధ తీర్చలేరు... వీరికి 151 సీట్లొచ్చిన్నా ఏం లాభం..: జగన్ పై పవన్ సెటైర్లు
జనానికి జ్ఞాపకశక్తి లేదని చంద్రబాబుకు అపారమైన నమ్మకమని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు దత్తకొడుకు, సొంత కొడుకు ఇక్కడికి దగ్గరలోనే వున్నారని ఆయన దుయ్యబట్టారు. దత్త, సొంత కొడుకులు 2014 నుంచి 19 మధ్య ఏం చేశారో చెప్పుకోలేక , ఏం చేస్తారో కొత్తగా చెప్పుకుంటున్నారని సజ్జల చురకలంటించారు.