ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎమ్మెల్యేలకు వైసీపీ విప్, ధిక్కరిస్తే కఠిన చర్యలు

By Siva KodatiFirst Published Mar 19, 2023, 8:46 PM IST
Highlights

ఈ నెల 23వ తేదీ నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తన పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ విప్ జారీ చేసింది. విప్ ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైసీపీ అధిష్టానం హెచ్చరించింది. 

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయ్యింది. ఈ నెల 23వ తేదీ నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది. ఈ నెల 20న జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని.. 23వ తేదీన పార్టీ సూచించిన అభ్యర్ధికి ఓటు వేయాలని వైసీపీ చీఫ్ విప్ ప్రసాదరాజు విప్ జారీ చేశారు. దీనిని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించిన విధంగానే తెలుగుదేశం పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. తమ పార్టీ తరఫున అభ్యర్థిని బరిలో నిలిపింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ సోమవారం నామినేషన్ ధాఖలు చేశారు. టీడీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్న అనురాధ.. గతంలో విజయవాడ మేయర్‌గా పనిచేశారు.

Also Read: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు : బరిలో టీడీపీ అభ్యర్ధి, అలర్ట్ అయిన వైసీపీ.. జగన్ కీలక భేటీ

ఇక, ఏపీలో ఎమ్మెల్యే కోటా కింద  7 ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నారా లోకేష్‌తో సహా ఏడుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. దీంతో 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక అనివార్యమైంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం మార్చి 6న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మార్చి 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న నామినేషన్ల పరిశీలన, 16వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. మార్చి 23వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.


 

click me!