రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బొత్స సత్యనారాయణ

Siva Kodati |  
Published : Mar 19, 2023, 07:24 PM IST
రాజకీయాల్లో గెలుపోటములు సహజం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బొత్స సత్యనారాయణ

సారాంశం

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓటమిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏం జరిగిందో విశ్లేషించుకుంటామని మంత్రి తెలిపారు. 

2004లో వోక్స్ వ్యాగన్ కేసు విషయంలో తామే సిబిఐ విచారణ కోరామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమెన్స్ దోపిడీపై అప్పటి టిడిపి ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ కేసులో చంద్రబాబు & కో ఉన్నారు కనుక మాట్లాడలేకపోయారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు దోపిడీ దొంగ అని లేని కంపెనీలు సృష్టించడం దారుణమైన నేరమని బొత్స అన్నారు. చంద్రబాబు ఏమైనా టిడిపి వ్యవస్ధాపకుడా... మామను వెన్నుపోటు పొడిచి లాక్కున్నాడని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి దుర్మార్గుడిని ప్రజలు ఎందుకు క్షమిస్తారని ఆయన ప్రశ్నించారు. 

రూపాయి సంపాదన రాలేదని సీమెన్స్ స్వయంగా చెప్పిందని.. చంద్రబాబు దొరను పోలిన దొంగ అని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. స్కిల్ కేసులో చంద్రబాబు పాత్ర ఉందని.. వైసీపీ ఎంఎల్ఏ లు ఎటువైపు చూస్తారో రేపు చూద్దామని మంత్రి వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంని జీఎస్టీ, ఈడీ సంస్థలు గుర్తించినా ఎందుకు స్పందించలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు స్కామ్‌లో వున్నందునే దర్యాప్తు చేయించలేదన్నారు. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమిపైనా బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏం జరిగిందో విశ్లేషించుకుంటామని మంత్రి తెలిపారు. 

ALso Read: బాలకృష్ణ, చంద్రబాబుకు మంత్రి రోజా సవాలు.. 2024లో మళ్లీ వైసీపీ దెబ్బ చూపిస్తామని కామెంట్..

అంతకుముందు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్జెంట్‌గా అధికారం చేపట్టాలన్న ఆశతో చంద్రబాబు వున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ప్రస్తుతం అవసాన దశలో వున్నారని.. సంక్షేమం అందుకున్న వారిలో ఎమ్మెల్సీ , ఉపాధ్యాయ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. చంద్రబాబుతో చెప్పించుకునే స్థితిలో జగన్, వైసీపీ లేరని.. ఇక చంద్రబాబు అసెంబ్లీలోకి వచ్చే అవకాశం లేదని సజ్జల ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని.. కడుపు మంటను వెళ్లగక్కడానికి ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని వాడుకున్నారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

ఎవడి పిచ్చి వాడికి ఆనందమని... ఇప్పుడు వ్యవస్థలు నాశనం అయ్యాయని చంద్రబాబు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని బండిల్స్ తీస్తే నిజాలు బయటకు వస్తాయని.. టీడీపీ వైరస్ లాంటిదని , అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తోందని సెటైర్లు వేశారు. పశ్చిమ రాయలసీమ వైసీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారని.. ఒక్క బండిల్‌లోనే 6 ఓట్లు తేడాగా కనిపించాయని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు 3 ఎమ్మెల్సీలు  గెలిచి  గవర్నర్‌ను కలవడం ఒక్కటే తక్కువన్నట్టు  మాట్లాడుతున్నారని రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu