వైఎస్ వివేకా హత్య: సునీల్ కస్టడీ పొడిగింపు కుదరదన్న కోర్టు

By narsimha lodeFirst Published Aug 16, 2021, 6:39 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్  ను మరోసారి కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు సోమవారం నాడు కోరారు. అయితే ఈ వినతిని కోర్టు తిరస్కరించింది. సునీల్ కి  నార్కో అనాలిసిస్ పరీక్షలకు అనుమతివ్వాలని కూడ సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న సునీల్ యాదవ్ ను  మరోసారి కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.గోవాలో అరెస్టైన సునీల్ యాదవ్ ను సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో 10 రోజుల క్రితం కస్టడీలోకి తీసుకొన్నారు.

also read:వివేకా హత్య కేసు: సునీత ఇంటి వద్ద రెక్కీ, కదిలిన యంత్రాంగం.. పోలీసుల అదుపులో నిందితుడు

ఈ కేసులో సునీల్ యాదవ్ ను విచారిస్తున్నారు. 10 రోజుల కస్టడీ ముగియడంతో  ఇవాళ పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు సునీల్ ను హాజరుపర్చారు. మరోవైపు సునీల్ ను మరో 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. అయితే ఈ వినతిపై సునీల్ యాదవ్ న్యాయవాది అభ్యంతరం తెలిపారు.  

రెండు రోజులే రిమాండ్ కు గడువు ఉన్న కారణంగా కస్టడీకి కోర్టు నిరాకరించింది. సునీల్ కి నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. ఈ మేరకు పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ అరెస్ట్ తర్వాత కీలక డాక్యుమెంట్లు, ఆయుధాలను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ కేసులో  పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.

click me!