బీటెక్ విద్యార్ధిని రమ్యను హత్య చేసిన నిందితుడు శశికృష్ణ అరెస్ట్ చేసినట్టుగా గుంటూరు రేంజ్ ఇంచార్జీ డీఐజీ రాజశేఖర్ చెప్పారు. ప్రేమించలేదనే నెపంతోనే రమ్యను శశికృష్ణ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని పోలీసులు సోమవారం నాడు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
గుంటూరు: ప్రేమించడానికి నిరాకరించిందనే నెపంతోనే రమ్యను శశికృష్ణ హత్య చేసినట్టుగా పోలీసులు తెలిపారు.ఆదివారం నాడు టిఫిన్ తీసుకొచ్చేందుకు ఇంటి నుండి బయటకు వెళ్లిన బీటెక్ విద్యార్ధిని రమ్యను శశికృష్ణ కత్తితో పొడిచి చంపాడు.శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నాడు పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
also read:హత్యకు గురైన రమ్య ఇంటి వద్ద ఉద్రిక్తత: తోపులాట, నారా లోకేష్ అరెస్టు
సోమవారం నాడు గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఇంచార్జీ డీఐజీ రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. ఇన్ స్టాగ్రామ్ లో గత 6 నెలల క్రితం శశికృష్ణకి రమ్యతో పరిచయం ఏర్పడిందని ఆయన చెప్పారు. అప్పటి నుండి శశికృష్ణ రమ్యని తాను చదువుతున్న కాలేజ్ వద్ద కలుస్తూ...ప్రేమిస్తున్నానని వేధించాడని డీఐజీ తెలిపారు.
ప్రేమకు ఆమె నిరాకరించడంతో శశికృష్ణ ఆమెను హత్య చేశాడని ఆయన చెప్పారు.మహిళల పై దాడులు చేసే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియా పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలలో పరిచయ అయ్యే వ్యక్తులకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ కేసులో ప్రతిభ కనపరచిన పోలీసులకు రివార్డులు అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.