తూ.గోదావరిలో ఆగని కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం 19,94,606 కి చేరిక

Published : Aug 16, 2021, 06:06 PM IST
తూ.గోదావరిలో ఆగని కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం 19,94,606 కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొన్ని జిల్లాల్లో  కరోనా కేసుల వ్యాప్తి తగ్గినా  మరికొన్ని జిల్లాల్లో కరోనా కేసుల వ్యాప్తి పెరిగింది. తూ.గోదావరి జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో46,962 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 909  మందికి కరోనా నిర్ధారణ అయింది. 

దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,94,606 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 13మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,660కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1543మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 63వేల 728 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 17,218 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,57,08,411 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో005,చిత్తూరులో 107, తూర్పుగోదావరిలో241,గుంటూరులో082,కడపలో 040, కృష్ణాలో047, కర్నూల్ లో008, నెల్లూరులో174, ప్రకాశంలో 086,విశాఖపట్టణంలో 061,శ్రీకాకుళంలో028, విజయనగరంలో 009,పశ్చిమగోదావరిలో 021 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  13మంది చనిపోయారు. చిత్తూరులో ముగ్గురు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున చనిపోయారు. తూర్పుగోదావరి, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,660కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,56,799, మరణాలు 1090
చిత్తూరు-2,35,195 మరణాలు1801
తూర్పుగోదావరి-2,82,949, మరణాలు 1241
గుంటూరు -1,70,737,మరణాలు 1168
కడప -1,11,673, మరణాలు 629
కృష్ణా -1,11,744,మరణాలు 1264
కర్నూల్ - 1,23,595,మరణాలు 844
నెల్లూరు -1,37,712,మరణాలు 982
ప్రకాశం -1,31,975, మరణాలు 1027
శ్రీకాకుళం-1,21,463, మరణాలు 772
విశాఖపట్టణం -1,53,834, మరణాలు 1097
విజయనగరం -81,857, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,72,178, మరణాలు 1076

 

 

PREV
click me!

Recommended Stories

Ultra-Modern Bhogapuram Airport: అత్యాధునిక హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ చూసారా?| Asianet Telugu
Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్ | Asianet Telugu