నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూ: హైకోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరణ

By telugu teamFirst Published Jun 2, 2020, 11:40 AM IST
Highlights

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే నియమించాలని ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టులో వేసిన పిటిషన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసీగా వెంటనే నియమించాలని ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 

అయితే, వాదనలు ప్రారంభమైన కొద్ది సేపటికే పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తున్నందున ఆ పిటిషన్ ను ఉపసహరించుకుంటున్నట్లు తెలిపింది. జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకంది. 

Also Read: వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ రమేష్ కుమార్: జగన్ ప్రభుత్వంపై ఆ తర్వాతే..

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే ఎస్ఈసీగా నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు మే 29వ తేదీన తీర్పు ఇచ్చింది. ఆయనను తొలగిస్తూ జారీ చేసిన జీవోలను కొట్టేసింది. 

కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సర్వీస్ నిబంధనలను, పదవీ కాలాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ను, ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

హైకోర్టు తీర్పు అమలుపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం కోరింది. దాంతో హైకోర్టులో వేసిన పిటిషన్ ను ప్రబుత్వం ఉపసంహరించుకుంది. 

Also Read: నిబంధనలు ఉల్లంఘించలేదు. అది కోర్టు ధిక్కరణే: నిమ్మగడ్డ రమేష్

ఇదిలావుంటే, తాను ఎస్ఈసీగా పదవీ బాధ్యతలను చేపట్టినట్లు రమేష్ కుమార్ ఇచ్చిన సర్క్యూలర్ ను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. దీంతో ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టే విషయంలో వేచి చూసే ధోరణిని రమేష్ కుమార్ ఎంచుకున్నారు.  

click me!