జగన్ ఢిల్లీ పర్యటన రద్దు... సడెన్ గా ఏమైంది?

By telugu news teamFirst Published Jun 2, 2020, 11:26 AM IST
Highlights

మంగళవారం ఉదయం 10.30కి గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరి.. ఒంటిగంటకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంది. 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంగళవారం  ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా... సడెన్ గా ఆ పర్యటన ఇప్పుడు రద్దు అయ్యింది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు జగన్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. మొదట కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అధికారులతో భేటీ కావాల్సి ఉంది. అయితే.. సడన్‌గా పర్యటన ఎందుకు వాయిదా పడింది అన్న విషయం మాత్రం తెలియరాలేదు.

పర్యటన రద్దు కాకపోయి ఉంటే.. జగన్ పర్యటన ఇలా సాగేది..

మంగళవారం ఉదయం 10.30కి గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన బయల్దేరి.. ఒంటిగంటకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంది. అక్కడి నుంచి నేరుగా జన్‌పథ్‌-1లోని తన నివాసానికి వెళ్తారని.. అనంతరం హోం మంత్రి అమిత్‌ షాతో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులు నిర్మలా సీతారామన్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి తదితరులను కూడా ఆయన కలుస్తారని నిన్నట్నుంచి వార్తలు వస్తున్నాయి.

ఈ వరుస భేటీల్లో భాగంగా రాష్ట్రానికి సాయం అందించాల్సిందిగా అభ్యర్థిస్తారని, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరతారని అధికార వర్గాలు సోమవారం నాడు మీడియాకు వెల్లడించారు. వీటితో పాటు ముఖ్యమంత్రిగా ఏడాది పాలనలో తీసుకునే అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టడం.. వాటికి సంబంధించి జగన్‌ తమ వైఖరిని అమిత్‌షాకు వివరించే అవకాశమున్నట్లు కూడా నిన్నట్నుంచి వార్తలు వినిపించాయి. మరీ ముఖ్యంగా శాసన మండలి రద్దుకు సహకరించాలని కేంద్రాన్ని కోరతారని కూడా వార్తలొచ్చాయ్.

click me!