ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో విపక్షాలు రగిలిపోతున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అభివృద్దిని దుష్టచతుష్టయం అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు.
విశాఖపట్టణం: ప్రభుత్వం మంచి చేస్తుంటే కడుపు మంటతో విపక్షాలు రగిలిపోతున్నాయని ఏపీ సీఎం YS Jagan అన్నారు. జగన్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని అడ్డంకులు సృష్టించారన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం చెప్పారు.16 నెలల తర్వాత పేదల కల సాకారం అవుతుందన్నారు.
గురువారం నాడు Visakhapatnam జిల్లాలోని సబ్బవరం మండలం పైడివాడ ఆగ్రహారంలో ఇళ్ల పట్టాలను సీఎం జగన్ లబ్దిదారులకు అందించారు ఈ కార్యక్రమం తర్వాత రాష్ట్రంలో ఇంటి అడ్రస్ లేని ఒక్క కుటుంబం కూడా ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. House Sites ఇవ్వడమే కాకుండా 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.రాష్ట్రంలో మంచి జరగడానికి దుష్టచతుష్టయం అడ్డు పడుతుందని CM ఆరోపించారు. మూడు రాజధానుల్లో విశాఖకు ఒక రాజధాని ఇస్తామంటే దుష్టచతుష్టయం అడ్డుకుంటుందన్నారు. అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమాన్ని కోర్టుకు వెళ్లి స్టే ద్వారా అడ్డుకున్నారని జగన్ విమర్శించారు. కర్నూల్ లో హైకోర్టు పెడతామంటే కూడా అడ్డుకుంటున్నారన్నారు.
undefined
TDP ప్రభుత్వ హయంలో పేదలకు ఇళ్లు కట్టించడానికి Chandrababu కు మనసు రాలేదన్నారు.చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 5 లక్షల ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు Hyderabad లో ప్యాలెస్ కట్టుకున్నారని జగన్ విమర్శలు చేశారు. అదే సమయంలో తాను విపక్ష నేతగా తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నానని జగన్ గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సీఎం జగన్ కోరారు.
ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా 15 లక్షల 60 వేల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నట్టుగా సీఎం చెప్పారు.. రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు వస్తున్నాయని సీఎం వివరించారు. రెండో దశ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా జగన్ చెప్పారు.విశాఖ జిల్లాలో ఇళ్ల పట్టాలు అందుకుంటున్న 10 వేల కుటుంబాలకు మంచి జరిగే అవకాశం ఉందన్నారు సీఎం. ఇళ్లను నిర్మించి రూ. 10 వేల కోట్ల ఆస్తిని అక్కా చెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నామని జగన్ చెప్పారు.పంచ లింగాల గ్రామాల సమస్య కోర్టులో ఉందన్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
విశాఖ జిల్లాలోని 72 లే ఔట్లలో లక్షా 28 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.ప్రతి ఒక్కరికీ స్వంత ఇల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ చెప్పారు. పైడివాడ అగ్రహారంలో తొలుత వైఎస్సార్ పార్క్‌లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు.