బాబు కోసమే నిఘా...ఆయనో దళారీ, మాఫియానే నడిపారు: ఏబీవీపై సజ్జల వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Feb 9, 2020, 5:15 PM IST

ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ క్రమంలో ఏబీ సస్పెన్షన్ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 


ఏపీ క్యాడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ క్రమంలో ఏబీ సస్పెన్షన్ వ్యవహారంపై వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

వైసీపీని దెబ్బతీయడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించారని.. 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు దళారీగా పనిచేశారని ఆరోపించారు. పరికరాలు కొని తనతో సహా మా నాయకుల ఫోన్లన్నింటినీ అక్రమంగా ట్యాప్ చేశారని సజ్జల అన్నారు. ఒక మాఫియానే నడిపించారని.. ఏబీవీ అక్రమాలను టీడీపీ ఎంపీ కేశినేని నాని పరోక్షంగా అంగీకరించారని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. 

Latest Videos

Also Read:చంద్రబాబు హయంలో నిఘా చీఫ్: ఏబీ వెంకటేశ్వర రావుకు బిగ్ షాక్

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వెంకటేశ్వర రావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ ఏబీ వెంకటేశ్వర రావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 

ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్ష, అపీల్) నిబంధనల నియమం 3(1) కిం ఆయనను సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో తెలిపారు. పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ గా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వర రావు భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అక్రమాలకు పాల్పడినట్లు తేలడంంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 

ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు నివేదికలో తేలిందని అంటున్నారు. ఏబీ వెంకటేశ్వర రావు పోలీసు ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. 

Also Read:ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌:కేశినేనిసెటైర్లు, కౌంటరిచ్చిన ఐపీఎస్ అధికారి

ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్, ఇండియన్ ప్రొటోకాల్ ఒకే విధమైన ప్రామాణికాలను కలిగి ఉంటాయని, దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ దాటి వెళ్లేందుకు వీలు లేదని ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.

1989 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావును ప్రజా ప్రయోజనాల రీత్యా సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. డీజీపీ స్థాయి అధికారి అయిన ఏబీ వెంకటేశ్వర రావుకు గత 8 నెలలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు.
 

click me!