చంద్రబాబు భంగపడ్డారు: కియా మోటార్స్ తరలింపు వార్తపై గోరంట్ల మాధవ్

Siva Kodati |  
Published : Feb 09, 2020, 02:42 PM IST
చంద్రబాబు భంగపడ్డారు: కియా మోటార్స్ తరలింపు వార్తపై గోరంట్ల మాధవ్

సారాంశం

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైరయ్యారు. కియా తరలిపోతుందనే అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్ సంస్థ ద్వారా సృష్టించి ప్రతిపక్షనేత భంగపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైరయ్యారు. కియా తరలిపోతుందనే అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్ సంస్థ ద్వారా సృష్టించి ప్రతిపక్షనేత భంగపడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. రాయిటర్స్‌ను చంద్రబాబే ప్రభావితం చేశారని ఎంపీ ఆరోపించారు.

రాయలసీమలో ఇంకా దుర్బర పరిస్ధితులు కొనసాగుతున్నాయని.. సీమ అభివృద్ధిని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. రాజధానిని సీమలోనే ఏర్పాటు చేయాలని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు జగన్ చేస్తున్నది ఇంకా తక్కువేనని గోరంట్ల అభిప్రాయపడ్డారు.

Also Read:లోకసభలో కియా మోటార్స్ ఇష్యూ: రామ్మోహన్ నాయుడ్ని అడ్డుకున్న గోరంట్ల మాధవ్

పార్లమెంట్‌లో తాను టీడీపీ ఎంపీలపై దాడి చేశానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. లోక్‌సభలో కియాపై అసత్యానలు అడ్డుకున్నానని.. అది తన బాధ్యతని మాధవ్ స్పష్టం చేశారు.

కియా ప్లాంట్ తరలిపోతుందంటూ వస్తున్న వార్తలపై గత గురువారం లోక్‌సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తావించారు. ఆయన సీటు వద్దకు వెళ్లి.. కియా మోటర్స్ ఎక్కడికి వెళ్లదని.. కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మాధవ్ మండిపడ్డారు.

Also Read:పరమ చెత్త ఊహాగానాలు: ప్లాంట్ తరలింపు వార్తలపై కియా మోటార్స్

ఇదే సమయంలో స్పందించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. కియా తరలిపోతుందనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. దీనిపై గందరగోళం నేపథ్యంలో కియా ఎంపీ స్వయంగా ప్రకటన జారీ చేశారు. అనంతపురం నుంచి కియా ప్లాంట్ ఎక్కడికి వెళ్లదని... తమకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను జగన్ ప్రభుత్వం అందజేస్తోందని ఆమె తెలిపిన సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం