బిల్లులను రాష్ట్రపతికి పంపాలా.. గవర్నర్‌కు సలహాదారువా: యనమలపై ఉమ్మారెడ్డి మండిపాటు

Siva Kodati |  
Published : Jul 31, 2020, 09:35 PM IST
బిల్లులను రాష్ట్రపతికి పంపాలా.. గవర్నర్‌కు సలహాదారువా: యనమలపై ఉమ్మారెడ్డి మండిపాటు

సారాంశం

పరిపాలనా వికేంద్రీకరణ , సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంపై వైసీపీ శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.

పరిపాలనా వికేంద్రీకరణ , సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపడంపై వైసీపీ శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఏదైనా బిల్లు రెండు సార్లు ఆమోదం పొందితే నిబంధనల ప్రకారం ఆ బిల్లును గవర్నర్ ఆమోదిస్తారని ఆయన చెప్పారు.

Also Read:ముందుగా విశాఖకు సీఎం కార్యాలయమే... ముహూర్తం ఇదే..

ఈ దశలో కూడా గవర్నర్‌ను యనమల తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారని ఉమ్మారెడ్డి మండిపడ్డారు. బిల్లులను రాష్ట్రపతికి పంపించమని లేఖ రాయడం వెనుక అంతర్యం ఏంటి..? యనమల ఏమైనా గవర్నర్‌కు సలహాదారా..? అని విమర్శించారు.

నారాయణ కమిటీ నివేదికతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి, శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందంటూ యనమల తన లేఖలో రాశారని వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఇది శివరామకృష్ణన్ కమిటీని కూడా అవమానపరచడమే అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:ఏపీకి 3 రాజధానులు: ఎప్పుడెప్పుడు ఏం జరిగాయంటే...

ఏది ఏమైనా ఈ రోజు గవర్నర్ వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు రెండింటిని ఆమోదించారని.. ఇప్పటికైనా టీడీపీ నేతలు చెంపలు వేసుకుని గవర్నర్ నిర్ణయానికి మద్ధతు పలకాలని ఉమ్మారెడ్డి హితవు పలికారు.

రాజ్యాంగబద్ధ నిర్ణయాలకు గౌరవం ఇవ్వాలన్నారు. కాగా సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ- ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులకు ఏపీ గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాష్ట్రంలో మూడు రాజధానుల అంశానికి తెరపడినట్లయ్యింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!