రాజధానులపై టిడిపి కుట్రలు...అయినా గెలుపు న్యాయానిదే: మంత్రి వెల్లంపల్లి

By Arun Kumar PFirst Published Jul 31, 2020, 9:33 PM IST
Highlights

ఐదుకోట్ల ఆంధ్రుల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆమోద ముద్ర వేశారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

విజయవాడ: ఐదుకోట్ల ఆంధ్రుల అభీష్టానికి అనుగుణంగా గవర్నర్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఆమోద ముద్ర వేశారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. టిడీపీ ఎన్ని కుట్రలు పన్నినా చివరికి న్యాయమే గెలిచిందని...తోక పార్టీలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని మంత్రి హెచ్చరించారు. 

''పదమూడు జిల్లాలను సమానంగా  అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగానే అందరి అభిప్రాయాల మేరకు మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారు. ప్రజాభిప్రాయం సేకరించిన కమిటీలు అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని నివేదికలు ఇచ్చాయి'' అని అన్నారు.

''స్వప్రయోజనాల కోసం చంద్రబాబు అండ్ కో  అన్నిప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను వ్యవస్థలను అడ్డుపెట్టుకొని అడ్డుకోవాలని చూసారు. శాసనమండలిలో దిగజారుడు రాజకీయాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసారు. అయినా చివరకు గవర్నర్ నిర్ణయంతో నవ్యాంధ్ర ప్రగతికి సోపానాలు పడబోతున్నాయి. సంక్షేమంతో పోటీగా అభివృద్దిని పరుగులు పెట్టిస్తాము'' అని వెల్లంపల్లి అన్నారు. 

read more   

సీఆర్‌డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ శుక్రవారం నాడు  ఆమోదం తెలిపారు. మూడు వారాల క్రితం ఈ రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపగా ఇవాళ గవర్నర్ వాటిపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

అధికారంలోకి వచ్చి తర్వాత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ  విషయాన్ని అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ ప్రకటించారు.
ఈ రెండు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఏడాది జూన్ మాసంలో శాసనమండలి వాయిదా పడింది. జూన్ కంటే ముందు జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని సూచించింది.అయితే సెలెక్ట్ కమిటి ఏర్పాటు కాలేదు. సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ  టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేశారు. 

మూడు రాజధానుల ప్రతిపాదనను  టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.  అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  

జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన మరోసారి ఈ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. శాసనమండలికి పంపారు. ఈ బిల్లులపై ఎలాంటి చర్చ జరగకుండానే మండలి వాయిదా పడింది. శాసనమండలి వాయిదా పడిన నెల రోజుల తర్వాత ఈ బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. 

దీంతో ఈ బిల్లులను ఆమోదించకుండా ఉండాలని విపక్షం లేఖలు రాసింది. యనమల రామకృష్ణుడు, చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశాడు.ఈ రెండు బిల్లుల విషయంలో న్యాయ సలహా తీసుకొన్న తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. 

click me!