లోకేష్ కు ఆళ్ళ సవాల్

Published : Jul 11, 2017, 07:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
లోకేష్ కు ఆళ్ళ సవాల్

సారాంశం

సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో తాను రూ. 10 కోట్లు కట్టటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆళ్ళ ఈరోజు మీడియాలో చెప్పారు. కాబట్టి ఇక మాటనిలబెట్టుకోవాల్సింది లోకేషే. ఎందుకంటే, సదావర్తి భూములను గనుక ఆళ్ళ కొనుగోలు చేసిన పక్షంలో ఐటి దాడులు చేయిస్తానని లోకేష్ బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే.

వైసీపీ ఎంల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కు సవాలు విసిరారు. సదావర్తి సత్రం భూముల వ్యవహారంలో తాను రూ. 10 కోట్లు కట్టటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆళ్ళ ఈరోజు మీడియాలో చెప్పారు. కాబట్టి ఇక మాటనిలబెట్టుకోవాల్సింది లోకేషే. ఎందుకంటే, సదావర్తి భూములను గనుక ఆళ్ళ కొనుగోలు చేసిన పక్షంలో ఐటి దాడులు చేయిస్తానని లోకేష్ బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకవేళ కోర్టు నిర్ణయించినట్లు రూ. 27 కోట్లు పెట్టి భూములు కొనకపోతే ఓడిపోయినట్లు అంగీకరించాలనే పిచ్చి కండీషన్ ఒకటి పెట్టారు లోకేష్ ఆమధ్య.

తమిళనాడులో ఉన్న వందల కోట్ల విలువైన సదావర్తి సత్రం భూములను  తన మద్దతుదారులకు చంద్రబాబునాయుడు కేవలం రూ.22 కోట్లకు కట్టబెట్టేసారు. విషయం వెలుగులోకి రాగానే ఆళ్ళ కోర్టులో కేసు వేసారు. సరే తర్వాత జరిగిన వ్యవహారం అంతా అందరికీ తెలిసిందే కదా? చివరకు రూ. 27 కోట్లు చెల్లించిన వారికి మొత్తం భూములను రిజిస్టర్ చేయించమని కోర్టు ఆదేశించింది. తన ఆదేశాల్లోనే ఆళ్ళగానీ లేదా ఆళ్ళ తరపున ఎవరైనా సరే భూములు కొనుక్కోవచ్చని వెసులుబాటు ఇచ్చింది కోర్టు.

ఆ విషయాన్నే లోకేష్ ప్రస్తావిస్తూ భూములు కొనుగోలుకు ఆళ్ళ ముందుకొస్తే ఐటిదాడులు చేయిస్తామంటూ బెదిరించారు. సరే ఆ బెదిరింపులను ఆళ్ళ లెక్కచేయలదనుకోండి అది వేరే సంగతి. మొత్తం డబ్బులు కట్టటానికి ఆళ్ళకు కోర్టు నెల రోజులు గడువిచ్చింది. అదే విషయమై ఆళ్ళ ఈరోజు మాట్లాడుతూ, కోర్టు ఆదేశాల ప్రకారం రూ. 10 కోట్లు కట్టడానికి తాను సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. అంటే మరి లోకేష్ ఆళ్ళపై ఐటి దాడులు చేయించటానికి సిద్ధమేనా? ఇపుడందరి దృష్టీ లోకేష్ పైనే ఉంది. ఏం చేస్తారో చూడాలి?  

PREV
click me!

Recommended Stories

PV Sindhu Visits Tirumala: భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఇక ఊపిరి పీల్చుకొండి.. తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గేది ఎప్పట్నుంచో తెలుసా?