విశాఖలో రౌండ్ టేబుల్ మీటింగ్:మూడు రాజధానులపై వైసీపీ కౌంటర్ ప్లాన్

By narsimha lodeFirst Published Sep 25, 2022, 11:56 AM IST
Highlights

మూడు రాజధానులపై వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.  ఉత్తరాంధ్రకు చెందిన మేథావులు, పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


విశాఖపట్టణం: మూడు రాజధానులపై వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తరా:ధ్రకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేరుగా కార్యాచరణను సిద్దం చేస్తుంది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత  మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. అమరావతి శాసనస రాజధానిగా విశాఖ పరిపాలనా రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది.

అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి.  అమరావతి ఆందోళనలు వెయ్యి రోజులను పూర్తి చేసుకున్నాయి. దీంతో ఈ నెల 12వ తేదీ నుండి అమరావతి నుండి అరసవెల్లికి 
పాదయాత్రను ప్రారంభించారు  అమరావతి రైతులు. అమరావతి రైతుల పాదయాత్రను వైసీపీ తీవ్రంగా తప్పుబడుతుంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నారని  మండిపడ్డారు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు సెంటిమెంట్ ఉండదా అని కూడా ప్రశ్నించారు.ీ నెల 15వ తేదీన ఏపీ అసెంబ్లీలో జరిగిన పాలనా వికేంద్రీకరణపైజరిగిన చర్చలో ఈ పాదయాత్ర  గురించి కూడా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.  ఈ పాదయాత్ర వెనుక చంద్రబాబు ఉన్నాడని విమర్శించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన మండిపడ్డారు.

విశాఖజిల్లా మీదుగా  అమరావతి రైతుల పాదయాత్ర అరసవెల్లికి వెళ్లనుంది. త్వరలోనే ఈ పాదయాత్ర విశాఖ జిల్లాకు చేరుకోనుంది. అయితే ఈ తరుణంలో విశాఖపట్టణం లో వైసీపీ మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మూడు రాజధానులను టీడీపీ, బీజేపీ,, జనసేన, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే పాలనా వికేంద్రీకరణ చేయడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంది. ఈ విషయమై  ఇవాళ వైసీపీ  చేపట్టిన రౌండ్ టేబుల్ సమావేశం ఏ రకమైన తీర్మానాలు చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. 
 

click me!