ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలోని పెదవేగి మండలం వేగివాడలో తల్లీ కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పెదవేగి మండలం వేగివాడలలో తల్లీ కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎలుకల మందు తీసుకుని వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో తల్లీ కూతుళ్లు మరణించారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ నెల 12వ తేదీన బాలికపై చిట్టిబాబు అనే యువకుడు అదే గ్రామానికి యువతి గ్రామం నుండి పారిపోయారు. ఈ విషయమై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు
. అదే రోజున సాయంత్రానికి యువతీ, యువకుడిని పోలీసులు స్టేషన్ కు తీసుకు వచ్చారు. అయితే ఈ విషయమై తాము చిట్టిబాబుపై ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు సరిగా స్పందించలేదని యువతి బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పోలీసులను బాధితురాలి తల్లి ప్రశ్నిస్తే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు అవమానించలేలా మాట్లాడారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
undefined
దీంతో మనోవేదనకు గురైన తల్లి ఇంటికి వచ్చిన తర్వాత తన కూతురితో కలిసి ఎలుకల మందు తీసుకుంది. దీంతో వెంటనే వారిని కుటుంబ సభ్యులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లీ కూతుళ్లు మరణించారు. ఈ విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాము నమోదు చేసని కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.