సోషల్ మీడియాలో దుష్ప్రచారం: సైబరాబాద్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు

By narsimha lode  |  First Published Feb 25, 2024, 11:13 AM IST

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు  వై.ఎస్. షర్మిల  సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.


హైదరాబాద్: సోషల్ మీడియాలో  తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ  కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు  వై.ఎస్. షర్మిల సైబరాబాద్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read:నడిరోడ్డుపై మహిళను వేధించిన వ్యక్తి: బుద్ది చెప్పిన ప్రయాణీకులు, సోషల్ మీడియాలో వైరల్

Latest Videos

undefined

ఈ ఏడాది జనవరి మాసంలో  వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నెల  21న కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా వై.ఎస్. షర్మిల బాధ్యతలు చేపట్టారు.  కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం చేసే కార్యక్రమాలను ప్రారంభించారు.

also read:ఇన్సూరెన్స్ డబ్బుల కోసం: అమ్మమ్మను మనవడు ఏం చేశాడంటే?

అయితే  తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న విషయమై  షర్మిల సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.యూట్యూబ్ చానెల్స్, సోషల్ మీడియాలో కూడ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా  తప్పుడు ప్రచారం చేస్తున్నారని షర్మిల ఆ ఫిర్యాదు  చేశారు.  తనపై  తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా ఖాతాల వివరాలను  షర్మిల   పోలీసులకు అందించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  షర్మిల తరపున ఆమె భర్త అనిల్ కుమార్  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read:బుల్లెట్‌ కు గుడి కట్టి పూజలు: ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఓట్లు, సీట్లను సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ముందుకు సాగుతుంది. రానున్న ఎన్నికల్లో సీపీఐ, సీపీఐ(ఎం) లతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది. లెఫ్ట్ పార్టీలతో  సీట్ల సర్దుబాటు విషయమై  రెండు రోజుల క్రితం షర్మిల చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే  తెలుగు దేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది.ఈ కూటమిలో బీజేపీ చేరే విషయమై చర్చ సాగుతుంది.  వైఎస్ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ చేయనుంది.

 

 

click me!