టిక్కెట్ ప్రకటించిన రోజే.. టీడీపీఅభ్యర్థికి తప్పిన పెను ప్రమాదం..

By Rajesh KarampooriFirst Published Feb 25, 2024, 6:15 AM IST
Highlights

TDP Chinarajappa: టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీల తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా..చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది. 

TDP Chinarajappa: ఇటీవలికాలంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నాయి.  డైవర్ల అజాగ్రత్త, నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, ట్రాఫిక్ రూల్స్ ను పాటించకపోవడం, మద్యం సేవించి ప్రయాణం చేయడం వంటి పలు కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల శుక్రవారం నాడు పటాన్ చెరువు  సమీపంలోని ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ యువ నాయకురాలు, సిక్రింబాద్ కంటోన్మెట్  ఎమ్మెల్యే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఎమ్మెల్యే కారుకు  ప్రమాదానికి గురైంది. పెద్దాపురం టీడీపీ అభ్యర్ధి, మాజీ హోం మంత్రి చినరాజప్ప కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కాకినాడ జిల్లా పెద్దాపురంలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకెళ్తే.. మాజీ హోం మంత్రి చినరాజప్పకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ఇరు పార్టీల తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే పెద్దాపురం సీటు టీడీపీ నుంచి చిన రాజప్పకు కేటాయించారు.  
 

Latest Videos

చినరాజప్పకు మూడో సారి టికెట్ దక్కడంతో జే తిమ్మాపురంలో తన అభిమానులు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సమయంలో చిన రాజప్ప ప్రయాణిస్తున్న కారుకు ఓ వ్యక్తి అకస్మాత్తుగా అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో చిన్నప్ప కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కింది. ప్రమాద సమయంలో చినరాజప్ప ఆ కారులోనే ఉన్నారు. వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు కారును డివైడర్‌ పైనుంచి కిందకు దించారు. అయితే.. ఈ ప్రమాదంలో చినరాజప్పకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పార్టీ శ్రేణలు ఊపిరిపీల్చుకున్నారు.
 

click me!