జగన్ పాదయాత్రపై కొత్త కుట్ర.. ?

Published : Oct 31, 2017, 05:42 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
జగన్ పాదయాత్రపై కొత్త కుట్ర.. ?

సారాంశం

‘వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు అనుమతి తీసుకోవాల్సిందే’..ఇవి తాజాగా డిజిపి చేసిన వ్యాఖ్యలు. డిజిపి వ్యాఖ్యలతో వైసీపీలో ఆందోళన పెరిగిపోతోంది.

‘వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు అనుమతి తీసుకోవాల్సిందే’..ఇవి తాజాగా డిజిపి చేసిన వ్యాఖ్యలు. డిజిపి వ్యాఖ్యలతో వైసీపీలో ఆందోళన పెరిగిపోతోంది. జగన్ పాదయాత్ర చేయాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే అంటూ సాంబశివరావు చెప్పటాన్ని వైసీపీ వర్గాలు తప్పుపడుతున్నాయి.

గతంలో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర విషయంలో కూడా పోలీసులు ఇదే విధంగా అభ్యంతరాలు చెప్పిన విషయం అందరకీ గుర్తుండే ఉంటుంది. అయితే, పాదయాత్రకు తాను పర్మీషన్ తీసుకునేది లేదని ముద్రగడ నిర్ణయించారు.  దాంతో గడచిన ఏడాదిగా ముద్రగడ పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటూనే ఉన్నారు.

తాజాగా డిజిపి ప్రకటనతో జగన్ పాదయాత్రను కూడా అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్ వేస్తున్నారా అన్న అనుమానాలను వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 6వ తేదీ నుండి పాదయాత్రకు పార్టీ అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్న నేపధ్యంలో డిజిపి ప్రకటన పట్ల అందరూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ పోలీసులు గనుక పాదయాత్రను అడ్డుకుంటే ఏం చేయాలనే విషయమై జగన్ కూడా సీనియర్లతో చర్చలు జరుపుతున్నారట. మరి, పాదయాత్రకు అనుమతి కోరుతూ జగన్ లేఖ రాస్తారా ? లేక అనుమతి అవసరం లేదంటూ ముద్రగడ బాటలోనే నడుస్తారా అన్నది సస్పెన్స్.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu