చంద్రబాబు ఆశలపై నీళ్ళు

First Published Oct 31, 2017, 1:00 PM IST
Highlights
  • తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి చూస్తుంటే చెప్పుకోవటానికైనా అసలు టిడిపి జాతీయ పార్టీయేనా అనిపిస్తోంది.
  • నిజానికి టిడిపి జాతీయపార్టీ కానేకాదు.
  • కానీ ఆమధ్య మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించారు కాబట్టి నేతలందరూ తమది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటున్నారు.

తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి చూస్తుంటే చెప్పుకోవటానికైనా అసలు టిడిపి జాతీయ పార్టీయేనా అనిపిస్తోంది. నిజానికి టిడిపి జాతీయపార్టీ కానేకాదు. కానీ ఆమధ్య మహానాడులో చంద్రబాబునాయుడు ప్రకటించారు కాబట్టి నేతలందరూ తమది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటున్నారు.  జాతీయపార్టీగా నేతలు చెప్పుకుంటే సరిపోదు. ఎన్నికల కమీషన్ ప్రకటించాలి

.

ఈసీ ప్రకటించాలంటే అందుకు కొన్ని అర్హతలుండాలి. పలు రాష్ట్రాల్లో పోటీ చేయటం, సీట్లైనా, ఓట్లైనా తెచ్చుకోవటం లాంటి అనేక అర్హతలను సాధించి ఉండాలి. అప్పుడే ఆ పార్టీని జాతీయ పార్టీగా ఈసి గుర్తిస్తుంది. ఇప్పటి వరకూ అవేవీ టిడిపికి లేవు. కాబట్టి నిస్సందేహంగా టిడిపి జాతీయ పార్టీ కాదని చెప్పవచ్చు.

సరే, ఇక ప్రస్తుతానికి వస్తే టిడిపిని జాతీయ పార్టీగా విస్తరించాలని చంద్రబాబు అనుకున్నారు. అందుకే తమిళనాడు, కర్నాటక, పాండిచ్చేరి, అండమాన్ దీవుల్లో సభ్యత్వ నమోదు చేస్తున్నట్లు నేతలు ఆమధ్య ప్రకటించారు. అండమాన్ స్ధానిక సంప్ధల ఎన్నికల్లో రెండు సీట్లు వచ్చాయి. దాంతో నిజంగానే టిడిపి జాతీయపార్టీ అయిపోయినట్లు సంబరాలు చేసుకున్నారు.

సరే, తెలంగాణాలో గెలిచిన 15 మంది ఎంఎల్ఏల్లో 12 మంది ఫిరాయించినా నిలుపుకోలేకపోయారన్నది వేరే సంగతి. జాతీయపార్టీ అంటూ మహానాడులో చేసిన తీర్మానం సంగతి దేవుడెరుగు బలంగా ఉన్న తెలంగాణాలో కూడా కుదేలైపోయింది. రేవంత్ రెడ్డి టిడిపికి రాజీనామా చేయగానే ఆయనతో పాటు మెజారిటీ నేతలు టిడిపిని వదిలేసారు.

మంగళవారం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధి సమక్షంలో రేవంత్ తో పాటు 18 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే తెలంగాణాలో టిడిపి పరిస్ధితి మూలిగే నక్కలాగుంది. దానిమీద రేవంత్ కేంద్రంగా జరుగుతున్న తాజా పరిణామాలు ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’గా తయారైంది. జాతీయ స్ధాయిలో టిడిపిని విస్తరించాలని చంద్రబాబు అనుకుంటే ఇపుడు అసలుకే మోసం వచ్చింది. ఇటువంటి పరిస్ధితుల్లో కూడా ఇంకా టిడిపిని జాతీయపార్టీ అనే అంటారా?

 

click me!