స్కూల్లోనే రాసలీలలు... ప్రియుడితో కలిసి రెండో భర్త హత్యకు మహిళ కుట్ర

Published : Sep 19, 2023, 04:05 PM IST
స్కూల్లోనే రాసలీలలు... ప్రియుడితో కలిసి రెండో భర్త హత్యకు మహిళ కుట్ర

సారాంశం

మొదటి భర్తతో విడాకులు తీసుకుని.... మరో వ్యక్తిని పెళ్లాడి... ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందో మహిళ. తమ అక్రమ బంధానికి అడ్డుగా వున్నాడని రెండో భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించేందుకు ప్లాన్ చేసింది. ఈ దారుణ విజయవాడలో వెలుగుచూసింది. 

విజయవాడ : మొదట ఎన్నారైని పెళ్లాడింది... అతడిపై కేసు పెట్టి లక్షల్లో డబ్బులు గుంజింది. ఆ తర్వాత మరొకరిని ప్రేమించి పెళ్లాడి ఇంకొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ అక్రమ సంబంధం గురించి రెండో భర్తకు తెలియడంతో ప్రియుడితో కలిసి అతన్ని చంపేందుకు కుట్ర పన్నింది. ఇలా ఓ మహిళ ఇద్దర్ని పెళ్లాడి, ఒకడితో అక్రమ సంబంధం పెట్టుకుని ఓ భర్త హత్యకు సిద్దపడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ యనమలకుదురులో నివాసముండే భావన యామిని ఓ ప్రైవేట్ స్కూల్లో అకౌంటెంట్ గా పనిచేస్తోంది. ఆమె గతంలో ఓ ఎన్నారైని పెళ్లాడి విడాకులు తీసుకుంది. ఎన్నారై భర్తపై కేసు పెట్టడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. దీంతో యామినికి రూ.40లక్షలు ఇచ్చి కేసు నుండి బయటపడ్డ ఎన్నారై భర్త విడాకులు ఇచ్చి దూరంగా వుంటున్నాడు. 

మొదటి భర్తలో విడాకుల తర్వాత యామిని గౌరీశంకర్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించింది. కొన్నాళ్ళ తర్వాత అతడిని పెళ్లాడింది. రెండో పెళ్లి తర్వాత సంసారం సాఫీగా సాగుతుండగా యామిని మరొకరితో వివాహేతర సంబంధాన్ని ఏర్పర్చుకుంది. యామిని పనిచేసే స్కూల్లోనే గుణదలకు చెందిన రమేష్ పనిచేస్తున్నాడు. అతడితో భార్య యామిని అక్రమసంబంధం పెట్టుకుంది.  ఈ విషయం ఆమె రెండో భర్త గౌరీశంకర్ కు తెలియడంతో మందలించాడు. 

Read More  ఉయ్యూరులో దారుణం... మహిళా వాలంటీర్ పై వైసిపి నేత లైంగిక వేధింపులు (వీడియో)

ఇలా తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని ప్రేమించి పెళ్లాడిన భర్తను అంతమొందించడానికి యామిని సిద్దపడింది. ప్రియుడు రమేష్ తో కలిసి భర్త గౌరీశంకర్ హత్యకు కుట్రపన్నింది. అయితే భార్యతో పొంచివున్న ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన గౌరీశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.దీంతో కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు