రెండేళ్లు సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్: చంద్రబాబు అరెస్ట్ పై సీఐడీ తరపు న్యాయవాది

By narsimha lode  |  First Published Sep 19, 2023, 3:32 PM IST

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని  ఏపీ సీఐడీ తరపు న్యాయవాది  ముకుల్ రోహత్గీ చెప్పారు.


అమరావతి: రెండేళ్లు సాక్ష్యాలు సేకరించాకే ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా సీఐడీ తరపు న్యాయవాది ముకుల్  రోహత్గీ  చెప్పారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై  ఏపీ హైకోర్టులో  మంగళవారంనాడు ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి.  మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఏపీ సీఐడీ తరపున  ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.  వర్చువల్ గానే  ముకుల్ రోహత్గీ  తన వాదనలు విన్పించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కు అనర్హుడని రోహత్గీ చెప్పారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే బాబును అరెస్ట్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి బాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయాలని రోహత్గీ ఏపీ హైకోర్టును కోరారు.సెక్షన్ 319 ప్రకారంగా ఎన్ని చార్జీషీట్లైనా వేయవచ్చని సీఐడీ తరపు న్యాయవాది చెప్పారు. అంతేకాదు ఈ సెక్షన్ ప్రకారంగా ఎంతమంది సాక్షులనైనా చేర్చొచ్చన్నారు. రూ. 371 కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేలాల్సి ఉందన్నారు. ఈ నిధులు జాడ తెలుసుకునేందుకు సీఐడీ విచారణ చేస్తుందని చెప్పారు.షెల్ కంపెనీల జాడ తీస్తున్నామన్నారు. 

Latest Videos

undefined

also read:ఆ ఎఫ్ఐఆర్ చట్టవిరుద్దం: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాడీ వేడీ వాదనలు

నిబంధనలకు విరుద్దంగా ఎంఓయూ నుండి సబ్ కాంట్రాక్టుకు ఎలా వెళ్లిందని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు.అన్ని బోగస్ కంపెనీలతో  ప్రజా ధనాన్ని లూటీ చేశారని సీఐడీ తరపు న్యాయవాది వాదించారు.ఈ డీల్ కు కేబినెట్ ఆమోదం కూడ లేదన్నారు. చంద్రబాబు పథకం ప్రకారంగా తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ. 371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని  రోహత్గీ  చెప్పారు.

click me!