కాకినాడలో కుడా నంద్యాల ఫలితమేనా?

Published : Aug 30, 2017, 11:50 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కాకినాడలో కుడా నంద్యాల ఫలితమేనా?

సారాంశం

కాకినాడలో కూడా నంద్యాల ఫలితమే రిపీటవుతుందా? క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. నంద్యాలలో గెలిచిన ఫార్ములానే చంద్రబాబునాయుడు కాకినాడలో కుడా అమలు చేసారన్నదాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అందుకే కాకినాడలో గెలుపుపై టిడిపి నేతలు అంత ధీమాతో ఉన్నారు. ప్రచారానికి రెండు రోజులుండగా చంద్రబాబు పర్యటించటంతోనే టిడిపి నేతలు రెచ్చిపోయారన్నది వాస్తవం.

కాకినాడలో కూడా నంద్యాల ఫలితమే రిపీటవుతుందా? క్షేత్రస్థాయిలో జరిగిన పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. నంద్యాలలో గెలిచిన ఫార్ములానే చంద్రబాబునాయుడు కాకినాడలో కుడా అమలు చేసారన్నదాంట్లో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అందుకే కాకినాడలో గెలుపుపై టిడిపి నేతలు అంత ధీమాతో ఉన్నారు. ప్రచారానికి రెండు రోజులుండగా చంద్రబాబు పర్యటించటంతోనే టిడిపి నేతలు రెచ్చిపోయారన్నది వాస్తవం.

కాకినాడ చరిత్రలోనే ఎన్నడూ కనీ వినీ ఎరుగనంత స్ధాయిలో డబ్బు ప్రవహించింది. 2014 ఎన్నికలో కూడా మహా ఇచ్చుంటే ఓటుకు రూ. 500 ఇస్తే గొప్పే. అటువంటిది మొన్నటి ఎన్నికలో వేలాదిమందికి సగటున ఓటుకు రూ. 3 వేలు ఇచ్చారని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో ఓటుకు రూ. 7 వేలు కూడా ఇచ్చారట. ప్రతీ వార్డులోనూ తక్కువలో తక్కువ 2 వేల ఓట్లు కొనుగోలు చేయాలన్న లక్ష్యంతోనే టిడిపి పనిచేసింది. అందుకనే 48 వార్డుల్లో టిడిపి 35 వార్డుల్లో గెలుస్తుందని అంచనా. అలాగే, భాజపాకు ఇచ్చిన వార్డుల్లో పోటీ చేస్తున్న టిడిపి రెబల్స్ లో కూడా మరో నలుగురు గెలుస్తారట. అంటే ఎంత తక్కువ చూసినా టిడిపి 40 వార్డుల్లో గెలవటం ఖాయమనిపిస్తోంది.

అదికూడా స్లమ్ ఏరియాలపైనే టిడిపి ప్రధానంగా దృష్టి పెట్టింది. ఉద్యోగులు ఎక్కువుగా ఉండే ఏరియాలపై టిడిపి నేతలు దృష్టి సారించలేదట. సరే, అధికార దుర్వినియోగమన్నది ఎటూ వుండనే ఉంది కదా? చివరకు ఎన్నికల డ్యూటాలోని పోలీసులే పలుచోట్ల టిడిపి అభ్యర్ధులకు ఓట్లు వేయమని ప్రచారం చేసినట్లు వైసీపీ ఆరోపణలు చేస్తున్న సంగతి చూస్తున్నదే. ఇలా అవకాశం ఉన్న ప్రతీ చోటా ప్రభుత్వ యంత్రాగాన్ని టిడిపి నేతలు వాడేసుకున్నారు.

అంతేకాకుండా మరీ విచిత్రం ఏంటంటే ఎన్నికల జరిగే చోట స్ధానికంగా శెలవు ప్రకటిస్తారు. కానీ కాకినాడలో అటువంటిదేమీ జరగలేదు. పైగా ఉద్యోగులందరినీ కచ్చితంగా సమాయానికే తమ ఆఫీసులకు చేరుకోవాలంటూ ఉన్నతాధికారుల నుండి మౌఖిక ఆదేశాలొచ్చినట్లు చెబుతున్నారు. అంటే, ఉద్యోగుల ఓట్లు వైసీపీకి పడతాయన్న ఉద్దేశ్యంతోనే టిడిపి ఆ విధంగా చేసిందని ప్రచారంలో ఉంది. అంతేకాకుండా పోలింగ్ లో ఉపయోగించిన ఈవీఎంల్లో ‘నోటా’ ఆప్షన్ లేదు. ఒకవేళ నోటా ఆప్షన్ ఉంటే ఓటర్లలోని  ప్రభుత్వ వ్యతిరేకత బయటపడతుందన్న  ఉద్దేశ్యంతోనే పాత ఈవీఎంలను ఉపయోగించిందట టిడిపి. మరి, ఇంత మ్యానేజ్ మెంటు తర్వాత కూడా టిడిపి గెలవకపోతే ఎలా?

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu
Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu