చంద్రబాబు నాయకత్వంలో కొత్త రాయలసీమ ‘ఉద్యమం’

First Published Aug 30, 2017, 11:27 AM IST
Highlights

నంద్యాల ఉప ఎన్నిక విజయంతో మారుతున్న చంద్రబాబు వ్యూహం

రాయలసీమ ప్రజలను చైతన్యం చేసేందుకు  సదస్సు

నంద్యాల ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక బృహత్తర కార్యక్రమం చేపడుతున్నారు. రాయలసీమ ప్రజల అజ్ఞానాన్ని పారదోలేందుకు తెలుగుదేశం పార్టీని ఆయన సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాయలసీమప్రజలను, ముఖ్యంగా అక్కడి  టిడిపియేతర నేతలను నీటిపారుదల గురించి ఎజుకేట్ చేసేందుకు బెంగుళూరులో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.తెలుగుదేశం ప్రభుత్వం అమలుచేస్తున్న నీటి పారుదల  పథకాలు ఎలా రాయలసీమను కృష్ణాజలాలలో ముంచెత్తనున్నాయో వివరించేందుకు సెప్టెంబర్ మూడో తేదీన బెంగుళూరులోని కృష్ణ సమిట్ బాంక్వెట్ హాల్ లో ‘రాయలసీమ సీమ సాగునీటి ప్రాజక్టుల అవగాహన కార్యక్రమం’ ఏర్పాటుచేస్తున్నారు. బెంగుళూరు టిడిపి ఫోరం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పార్టీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగుతుంది.

వరద నీళ్లు కాకుండా నికర జలాలు ఇవ్వండనేది రాయలసీమోళ్ల ముఖ్యమయిన కోరిక. శ్రీశైలం రిజర్వారయ ర్ నుంచి  పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు రావాలంటే రిజర్వాయర్ లో 843 అడ్డగులకు పైగా  నీటి మట్టం ఉండాలి. ప్రభుత్వం ఉత్తర్వుల ద్వారా నీటి మట్టం 843 అడుగులకిందికి తీసుకువచ్చారు. రాజర్వాయర్ నీటి మట్టం ప్రాజక్టు కట్టిన నాడు అనుకున్నట్టు 854 అడుగులకు  తీసుకురావాలి. దీనికి బదులు 834 అడుగులకు తగ్గించారు. దీని వల్ల రిజర్వాయర్ నీరు పోతిరెడ్డి పాడుకు నీరెలా అందుతుంది. నీటిమట్టం 854 కుతీసుకురావలేనేది రాయలసీమనాయకుల డిమాండ్. అపుడే కెసి కెనాల్ కు రావలసిన నీరు కూడా రాదు. అయితే, దీనిని ముఖ్యమంత్రి ఎపుడు పట్టించుకోలేదు.

ఇపుడు రాయలసీమ నుంచి ఎదురువుతున్న ప్రశ్నలతో నిమిత్తం లేకుండా తామెలా రాయలసీను నీళ్ల మయం చేయాలనుకుంటునారో బెంగుళూరులో చెప్పబోతున్నారు. అది నిజమని నమ్మాలంటున్నారు. సమావేశంలో కుప్పం బ్రాంచ్ కాలువు, మారాల రిజర్వాయర్, మడకసిర బ్రాంచ్ కాలువ, చెర్లోపల్లి రిజర్వాయర్, సిద్ధాపురం ఎత్తిపోతలు, గోరుకల్లు రిజర్వాయర్, ముచ్రుమర్రి ఎత్తి పోతలు, గండికోట రిజర్వాయర్, గండికోట సిబిఆర్ ఎత్తిపోతలు, పులికనుమ ప్రాజక్టుల గురించి అవగాహన కల్గిస్తారు.అయితే, కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎంత స్మార్టో తెలిసిందే.  ప్రత్యర్థులు మాత్రం రాయలసీమను గూర్చి మాట్లాడితే ప్రాంతీయ వాది అని బ్రాండ్ వేసి, కోస్తాలో వోట్లు రాలవనే భయాలూ సందేహాలూఅనుమానాలు సృష్టించాడు.రాయలసీమ అంటేకోస్తా నుంచ దూరమౌతామనే భయంతోనే ప్రతిపక్ష పార్టీలు, నేతుల రాయలసీమ  మౌనవ్రతం పాటిస్తుంటే, ముఖ్యమంత్రి  రాయలసీమ చైతన్య ‘ఉద్యమం’ చేపడుతున్నారు. ఇందులో తొది కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అట. ఏవరయినా రాయలసీమవాదులు చొరబడి గొడవచేస్తే ఎలా... అందుకే రిజస్ట్రేషన్ తప్పని సరి చేశారు. ఆ సాకుతో రాయలసీమ ఉద్యమకారుల పేరు వూరు అడ్రసు ఫోన్ నంబర్లు సేకరించిపెట్టుకుంటారు.  ఆ తరువాత చెప్పేదేముంది?  సామదానభేదదండోపాయాలు షురూ అవుతాయని వేరేచెప్పనవసరంలేదు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలేబాబు మాయోపాయలకు పడిపోతుంటే, అమాయిక కుర్రకారు ఉద్యమకారులమీద ఈయన చూపబోయే ప్రతాపం ఎలా వుంటుందో సులభంగా వూహించవచ్చు!

అంతా బాగుంది గాని,  ఏ అనంతపురంలోనో కర్నూలులోనో సదస్సు పెట్టకుండా బెంగళూరులో సదస్సు పెట్టడం ఎందుకో... రాయలసీమ విద్యావంతులనే టార్గెట్ చేయడమేనా లక్ష్యం?

 

 

 

 

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి 

click me!