రాష్ట్రమంతా నంద్యాల ఫార్ములానే అమలు చేస్తారట

First Published Aug 30, 2017, 9:01 AM IST
Highlights
  • నంద్యాల ఫార్ములానే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా అమలు చేయాలని టిడిపి నిర్ణయించింది.
  • నంద్యాల ఉపఎన్నిక టిడిపికి ప్రతికూలంగా ఉన్నా నేతలు పనిచేసిన విధానం, టీం వర్క్, గెలవటానికి దోహదపడిన కారణాలతో ఓ పుస్తకాన్ని ముద్రించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు.
  • ఎందుకంటే, ఆ ఫార్ములాపై పార్టీలోని నేతలందరికీ శిక్షణ ఇస్తారట.
  • అందుకే నంద్యాలలో పనిచేసిన నేతలందరూ తమ అనుభవాలను చెబితే ఓ పుస్తకం వేసి పార్టీలోని నేతలందరికీ పంచాలని నిర్ణయించారు.

నంద్యాల ఫార్ములానే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా అమలు చేయాలని టిడిపి నిర్ణయించింది. నంద్యాల ఉపఎన్నిక టిడిపికి ప్రతికూలంగా ఉన్నా నేతలు పనిచేసిన విధానం, టీం వర్క్, గెలవటానికి దోహదపడిన కారణాలతో ఓ పుస్తకాన్ని ముద్రించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఎందుకంటే, ఆ ఫార్ములాపై పార్టీలోని నేతలందరికీ శిక్షణ ఇస్తారట. అందుకే నంద్యాలలో పనిచేసిన నేతలందరూ తమ అనుభవాలను చెబితే ఓ పుస్తకం వేసి పార్టీలోని నేతలందరికీ పంచాలని నిర్ణయించారు.

ప్రతీ నియోజకవర్గంలోనూ నంద్యాల తరహా విజయమే రావాలని సిఎం ఆశించటంలో తప్పులేదు. అసలు నంద్యాలలో టిడిపి ఎలా గెలిచిందన్న విషయంలో అందరికన్నా ఎక్కువ క్లారిటీ ఉన్నది చంద్రబాబుకే. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఎంఎల్ఏ, ఎంఎల్సీ, నేతల కోసం చంద్రబాబు  ఓ వర్క్ షాపు ఏర్పాటు చేస్తున్నారు.

అందులో నంద్యాల, కాకినాడ అనుభవాలను వివరిస్తారట. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళిన విధానం తదితరాలను వివరిస్తారట. నంద్యాలలో పనిచేసిన నేతల కృషినే ఇతర నియోజకవర్గాల్లోని నేతలు కూడా ఆదర్శంగా తీసుకోవాలట. ఈ మేరకు అందరికీ తగిన శిక్షణ కూడా ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు.

ప్రతీ నియోజకవర్గంలోనూ నంద్యాల ఫార్ములానే అమలు చేయాలంటే సాధ్యమేనా? మొన్న జరిగింది ఒక నియోజకవర్గంలోని ఉపఎన్నికే కాబట్టే చంద్రబాబు వేసిన ఎత్తులన్నీ పారింది. వైసీపీ సవాలు విసిరినట్లు ఒకేసారి 20 నియోజకవర్గాల్లో ఎన్నికలొస్తే తెలుస్తుంది చంద్రబాబు సత్తా ఏంటో. నిజంగానే అభివృద్ధి, సంక్షేమ పథకాలే నంద్యాలలో టిడిపిని గెలిపిస్తే మిగిలిన 20 మంది పిరాయింపు ఎంఎల్ఏలతో కూడా రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్ళవచ్చు కదా? మరి ఆ దిశగా ఎందుకు ఆలోంచిచటం లేదు?

అదే సమయంలో రాష్ట్రంలోని మైనారిటీలంతా ఇక నుండి టిడిపికే మద్దతిస్తారన్న విషయం కూడా స్పష్టమైపోయిందట నంద్యాల ఎన్నికతో. మొన్నటి వరకూ మైనారిటీల మద్దతుపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినట్లు చంద్రబాబు చెబుతున్నారు.

టిడిపిపై మైనారిటీల్లో విశ్వాసం కలిగిందట. ఇంతకాలమున్న అడ్డుగోడను అధిగమించినట్లు చంద్రబాబు సంబరపడుతున్నారు. భాజపాతో కలిస్తే మైనారిటీలు టిడిపికి మద్దతివ్వరన్నది ఓ అపోహేనట. అదికూడా ఇపుడు తొలగిపోయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అంటే భవిష్యత్తులో భాజపాతో పొత్తు విషయంలో ఇది కూడా ఓ కీలక అంశమవుతుందేమో చూడాలి.

click me!