ప్రియుడి మోజులో భర్త హత్య: నిందితులను పట్టించిన సెల్‌ఫోన్

First Published Aug 2, 2018, 11:17 AM IST
Highlights

ప్రియుడి మోజులో  భర్తను హత్య చేసింది భార్య. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.  అయితే  సెల్‌పోన్ ‌ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 
 

 


రంపచోడవరం: ప్రియుడి మోజులో  భర్తను హత్య చేసింది భార్య. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకొంది.  అయితే  సెల్‌పోన్ ‌ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. 

తూర్పు గోదావరి జిల్లా  రాజమండ్రి సమీపంలోని హుకుంపేట లో వడ్డీ ఇమ్మానుయేల్, దేవి నివాసం ఉండేవారు.  వీరికి ఓ కొడుకు, ఓ కూతురు. ఇమ్మానుయేల్  తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. శివ అనే వ్యక్తి కూడ తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు.  ఇద్దరూ  కలిసి పనిచేసేవారు.  అయితే దేవి పిల్లలను  స్కూల్ కు తీసుకెళ్లే సమయంలో  శివతో  దేవికి  మధ్య పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం  వివాహేతర సంబంధానికి దారితీసింది.

శివకు, తన భార్య దేవికి మధ్య వివాహేతర సంబంధం ఉన్న విషయం  భర్త ఇమ్మానుయేల్‌కు తెలిసింది. దీంతో  అతను  భార్యతో తరచూ గొడవకు దిగేవాడు.  ఈ గొడవ లతో విసిగిపోయిన  దేవి  ఇమ్మానుయేల్  అడ్డు తొలగించాలని ప్లాన్ వేశారు.ఈ మేరకు పథకం వేశారు. 

గత నెల 26 వ తేదీన  రాజమండ్రిలోని క్వారీ మార్కెట్ సెంటర్‌కు రావాలని ఇమ్మానుయేల్‌ను శివ కోరారు. శివ కోరిక మేరకు ఇమ్మానుయేల్ క్వారీ సెంటర్ కు చేరుకొన్నాడు.  అక్కడి నుండి ఇద్దరూ కలిసి ఐ.పోలవరం సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకొన్నారు.  గోకవరం సమీపంలో మద్యం కొనుగోలు చేశారు. అటవీ ప్రాంతంలో ఇమ్మానుయేల్ కు శివ మద్యం తాగించాడు.  గోకవరం వెళ్లి ఇమ్మానుయేల్ భార్య దేవిని కూడ  సంఘటనాస్థలానికి  తీసుకొచ్చాడు. మద్యం తాగే సమయంలో ఆ ప్రాంతానికి తన భార్య రావడం పట్ల ఇమ్మానుయేల్  సీరియస్ అయ్యాడు. భార్య, భర్తలు తీవ్రంగా గొడవపడ్డారు. ఈ సమయంలోనే  ఇమ్మానుయేల్ గొంతు నులిమి శివ సహాయంతో దేవి హత్య చేసింది. 

మృతదేహన్ని పెట్రోల్ పోసి తగులబెట్టారు. అయితే సంఘటనా స్థలంలో  మృతుడి సెల్‌ఫోన్ లభ్యమైంది. ఆ ఫోన్‌లో సిమ్ కార్డు లేదు.  కానీ, ఫోన్‌ నుండి వెళ్లిన మేసేజ్‌లకు సంబంధించి ఒక్క నెంబర్ పోలీసులకు లభ్యమైంది. 

ఆ నెంబర్ ఆధారంగా మృతుడు  ఇమ్మానుయేల్ గా గుర్తించారు. మద్యం బాటిల్‌పై ఉన్న లేబుల్ ఆధారంగా గోకవరం మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఈ మద్యం దుకాణంలో సీసీటీవీ పుటేజీ ఆధారంగా  పోలీసులు  నిందితుడు శివను గుర్తించారు.శివను అరెస్ట్ చేయడంతో  అసలు విషయం వెలుగు చూసింది. శివతో పాటు అతడికి సహకరించిన మృతుడి సతీమణి దేవిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ వార్తలు చదవండి: కుర్రాడితో ఎఫైర్: ఆమెకు 30, అతడికి 16 ఏళ్లు, పారిపోయిన జంట

                                వివాహేతర సంబంధం: ఎఫైర్ వద్దన్న ప్రియుడికి షాకిచ్చిన లవర్

 


 

click me!