
విజయనగరం : ప్రియుడితో కలిసి జీవించేందుకు భర్త అడ్డుగా వస్తున్నాడని కిరాతకంగా కడతేర్చింది ఓ భార్య. పథకం ప్రకారం హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ సంఘటన మీద కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంట్యాడ మండలంలోని లక్కిడం గ్రామానికి చెందిన సింగంపల్లి రాము (43) సోమవారం సాయంత్రం బైక్ మీద విజయనగరం ఆస్పత్రికి వెళ్లి మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి రాలేదు. ఉదయం ఆరు గంటల సమయంలో రాము తమ్ముడికి ఫోన్ వచ్చింది. మీ అన్నయ్య కోటర్బిల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మీద చనిపోయి ఉన్నాడని అటుగా వెళ్తున్న వారు చూసి ఫోన్ చేసి చెప్పారు.
దీంతో వెంటనే వివరాలు కుటుంబ సభ్యులకు తెలిపి అక్కడికి చేరుకునేసరికి.. ఘటనా స్థలంలో మృతదేహం ఒక చోట, బైక్ మరొకచోట పడి ఉన్నాయి.ముందు రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయిన ఉంటాడు అని అంతా అనుకున్నారు. అయితే మృతుని తల మీద బలమైన గాయాలు ఉండటంతో.. అతని సోదరుడికి అనుమానం వచ్చింది. ఇది రోడ్డు ప్రమాదం కాకపోవచ్చని.. హత్య చేసి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయనగరం నుంచి క్లూస్ టీం వచ్చి సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు.
మహిళా భక్తులను లోబర్చుకొని రాసలీలలు.. వెలుగులోకి రాయదుర్గ ఆలయ అర్చకుడి బాగోతం
వివాహేతర సంబంధం…
మృతుడి రాము భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇదే విషయం మీద వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఎలాగైనా అటు తొలగించుకోవాలని భావించిన రాము భార్య తులసి, ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఘటన జరిగిన రోజు విజయనగరం ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ విషయాన్ని తెలియ జేసింది. ఇద్దరూ కలిసి కొఠారుబిల్లి గ్రామానికి వెళ్లి జంక్షన్ దగ్గర మాటు వేసారు. విజయనగరంలో పని ముగించుకుని వస్తున్న భర్తను ప్రియుడితో కలిసి తులసి చంపించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని నమ్మించాలని చూసింది. మృతదేహం ఒక చోట, బైక్ను మరొకచోట పడేసి వెళ్లిపోయారు. అయితే మృతుడి తమ్ముడికి అనుమానం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో హతురాలు నేరం అంగీకరించింది. హతుడు రాముకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.