
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy) పట్ల ప్రజల్లో వున్న ఛరిష్మా తగ్గిపోతోందంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారంపై మాజీ మంత్రి పేర్ని నాని (perni nani) కౌంటరిచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ సర్వే చేపట్టిన సంస్థ పేరు సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ అని తెలిపారు. ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్న రాబిన్ శర్మదని నాని వెల్లడించారు. చంద్రబాబుకు (chandrababu naidu) సలహాలు ఇస్తున్న సంస్థ జగన్ కు వ్యతిరేకంగా సర్వేను ఇవ్వక ఏం చేస్తుందని పేర్ని నాని దుయ్యబట్టారు.
ఇకపోతే.. జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ పైనా (pawan kalyan) మాజీ మంత్రి చురకలు వేశారు. పవన్ ద్వారా తన గ్రాఫ్ పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నించిందని, కానీ అక్కడ నిరాశే ఎదురైందన్నారు. వైసీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదని.. ఆ పార్టీ వాళ్లకు తెలిసిపోయిందని పేర్ని నాని అన్నారు. టీడీపీ మునిగిపోతోన్న నావ అని.. దీనిని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి తప్పుడు సర్వేను ప్రచారం చేస్తున్నారని బందరు ఎమ్మెల్యే ఆరోపించారు. ఇలాంటి భోగస్ సర్వేలు సీఎం జగన్‌ను ఏం చేయలేవని.. ప్రజల్లో వున్న ఆయన గ్రాఫ్ ను ఎవ్వరూ తగ్గించలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.
ALso REad:పవన్ కళ్యాణ్‌ది వీకెండ్ ప్రజాసేవ.. రాజకీయాలకు కూడా ఆలస్యమే: పేర్ని నాని సెటైర్లు
కాగా.. సోమవారం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్‌ది వీకెండ్ ప్రజాసేవ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పిన 98 శాతం హామీలకు సీఎం వైఎస్ జగన్ అమలు చేశారని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా.. చెప్పనవి కూడా సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. విద్య, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు.
విశ్వసనీయతకు, విలువలకు అద్దం పట్టేలా సీఎం జగన్ పాలన సాగుతుందని పేర్ని నాని చెప్పారు. వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారని అన్నారు. భారీగా వర్షం పడుతున్న కార్యకర్తలు వైసీపీ ప్లీనరీ పాల్గొన్నారని చెప్పారు. అదే సమయంలో పవన్ కకళ్యాణ్‌పై విమర్శలు గుప్రపించారు. పక్షానికి ఒకసారి సెలవు రోజున పవన్ ప్రజా సేవ చేస్తారని ఎద్దేవా చేశారు. పవన్ షూటింగ్‌లకే కాదని.. రాజకీయాలకు కూడా ఆలస్యమేనని విమర్శించారు. పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టడమనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.