ఎమ్మెల్యే, ఎంపీలకు ‘ఆ’ నిబంధన అవసరం లేదా?

Published : Oct 05, 2017, 02:19 PM ISTUpdated : Mar 25, 2018, 11:46 PM IST
ఎమ్మెల్యే, ఎంపీలకు ‘ఆ’ నిబంధన అవసరం లేదా?

సారాంశం

కనీస విద్యార్హత కూడా లేని వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పదవులను అలంకరించి రాజ్యమేలుతున్నారు.  రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఎలాంటి విద్యార్హత అవసరం లేదని మన రాజ్యాంగమే చెబుతోంది.  రాజ్యాంగంలో ఈ ఈ నియమాన్ని చేర్చినప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు అక్షరాస్యత చాలా తక్కువ.

మన దేశంలో రాజకీయ సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందా? అలాంటి పరిస్థితులే కనపడుతున్నాయి. కనీస విద్యార్హత కూడా లేని వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల పదవులను అలంకరించి రాజ్యమేలుతున్నారు. రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఎలాంటి విద్యార్హత అవసరం లేదని మన రాజ్యాంగమే చెబుతోంది. రాజ్యాంగంలో ఈ ఈ నియమాన్ని చేర్చినప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు అక్షరాస్యత చాలా తక్కువ. అందుకే ఆ రోజుల్లో ఆ నియమం పెట్టారు. ఇప్పుడు కాలం మారింది అయినప్పటకీ.. ఇదే నియమాన్ని కొనసాగిస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు కనీసం పదో తరగతి పాస్ అయ్యి ఉండాలనే నియమాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొని రావాలని అనుకుంటోంది. ఇది మంచి విషయమే. గ్రామ సర్పంచ్ చదువుకున్నవాడైతే.. గ్రామం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. స్థానిక నేతల మాటలు వింటూ వారిగి తలొగ్గాల్సిన పరిస్థితి ఉండదు. అదేవిధంగా అవినీతిని కూడా అరికట్టవచ్చు అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఇది బాగానే ఉంది. మరి ఇదే నిర్ణయం ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో ఎందుకు తీసుకోకూడదు. వీరికి కూడా కనీస విద్యార్హత పెడితే.. నియోజకవర్గాలు, జిల్లాలు, మొత్తం రాష్ట్రమే బాగుపడుతుంది. ఇదే డిమాండ్ ప్రజల్లో చాలాకాలం నుంచే ఉంది.

అంతేకాదు.. పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. టీచర్స్ నియోజకవర్గంలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తిగా టీచర్ కానక్కర్లేదు. కానీ.. ఓట్లు వేసే వాళ్లు మాత్రం కచ్చితంగా టీచర్లే అయ్యి ఉండాలి. అదేవిధంగా పట్టుబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అంతే.. పోటీ చేసే వ్యక్తి పట్టభద్రుడు అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఓట్లు వేసే వాళ్లు మాత్రం పట్టభద్రులు అయ్యి ఉండాలి. ఇలాంటి అసంబద్ధ నియమనిబంధనల కారణంగానే ఓటర్లలోనూ అనాసక్తి పెరిగిపోతోంది. ఓటింగ్ శాతం కూడా తగ్గిపోతోంది. ఈ విషయంపై  కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలోచించి సంస్కరణలు చేపడితే.. దేశం అభివృద్ధిలో ముందుకు సాగే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu