
ఒకవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ సక్రమంగా జరగటం లేదని ఓవైపు చంద్రబాబునాయుడు మండిపడుతున్నారు. నేతలకు క్లాసుల మీద క్లాసులు తీసుకుంటున్నారు. అయితే, కొందరు నేతలకు ఇవేమీ పట్టినట్లు లేదు. కార్యక్రమాన్ని గాలికొదిలేసి రోడ్లపై డ్యాన్సులు చేసారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గంకు చెందిన పలువురు నేతలు రోడ్లపై డ్యాన్సులు చేయటం జిల్లాలో చర్చనీయాంశమైంది. డ్యాన్సులు చేసిన వారిలో మహిళా ఎంపిటిసిలు కూడా ఉండటం ఆశ్చర్యం.