వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

Published : Sep 23, 2018, 03:19 PM ISTUpdated : Sep 23, 2018, 03:24 PM IST
వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

సారాంశం

గ్రామదర్శిని వెళ్తుండగా డుంబ్రిగుంట మండలం లిప్పిట్టిపుట్టు గ్రామ సమీపంలోకి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వాహనం చేరుకోగానే  మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షి తెలిపారు

విశాఖపట్టణం: గ్రామదర్శిని వెళ్తుండగా డుంబ్రిగుంట మండలం లిప్పిట్టిపుట్టు గ్రామ సమీపంలోకి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు వాహనం చేరుకోగానే  మావోయిస్టులు దాడికి పాల్పడ్డారని ప్రత్యక్షసాక్షి తెలిపారు. వాహనాల్లోని అందరిని పక్కకు తీసుకెళ్లారని ప్రత్యక్షసాక్షి తెలిపారు.

ఇవాళ ఉదయం అరకు నుండి  ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమలు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వాహనంలో బయలుదేరారు. వీరిద్దరూ ప్రయాణీస్తున్న  వాహానం లిప్పిట్టిపుట్టు గ్రామానికి చేరుకోగానే  మావోయిస్టులు ఈ వాహానాన్ని చుట్టుముట్టారు.

వాహనం నుండి ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివిరి సోమను పక్కకు తీసుకెళ్లారని ఆయన చెప్పారు. గన్‌మెన్లను మరోపక్కకు తీసుకెళ్లారని చెప్పారు. వాహనం లో ఉన్న తనను ఎవరని ప్రశ్నిస్తే  తాను టీడీపీ కార్యకర్తగా చెప్పానని  ఆ వ్యక్తి చెప్పాడు.

దీంతో తనను మరోపక్కకు తీసుకెళ్లాడని చెప్పారు. అందరిని వేర్వేరు పక్కలకు తీసుకెళ్లారని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సర్వేశ్వరరావుతో పాటు మాజీ ఎమ్మెల్యేపై మావోయిస్టులు కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ఈ ఘటనలో వారిద్దరూ కూడ అక్కడికక్కడే మృతి చెందారని ప్రత్యక్షసాక్షి తెలిపారు.

సంబంధిత వార్తలు

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

నాన్నను ఎందుకు చంపారో తెలియదు: కుమారుడు నాని

పబ్లిసిటీ కోసమే మావోలు ఎమ్మెల్యేను చంపారు: రిటైర్డ్ ఐపీఎస్

PREV
click me!

Recommended Stories

YS Jagan Pressmeet: చంద్రబాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Andhra pradesh: ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని జ‌గ‌న్ ఎందుకు కోరుకుంటున్నారు.? ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్