ప్రజాప్రతినిధులంతా జాగ్రత్తగా ఉండండి: సీఎం చంద్రబాబు

By sivanagaprasad kodatiFirst Published Sep 23, 2018, 3:17 PM IST
Highlights

అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారు సర్వేశ్వరరావు... మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారు సర్వేశ్వరరావు... మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హత్యపై అమెరికాలో ఉన్న ముఖ్యమంత్రికి హోంమంత్రి చినరాజప్ప ఫోన్ ద్వారా తెలిపారు.

అరకు ఏజెన్సీలో మావోల దాడిని సీఎం ఖండించారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను కొనియాడారు. ఇలాంటి దాడులు మానవత్వానికే మచ్చని.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ ఈ దాడిని ఖండించాలన్నారు.

అలాగే గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనే ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారికి అదనపు భద్రత కల్పించాలని సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. 

నాన్నను ఎందుకు చంపారో తెలియదు: కుమారుడు నాని

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..

click me!