(వీడియో) ఆ ప్యాన్ట్రీ వాహనంలో ఏముందో?..రూ. 100 కోట్లని ప్రచారం

First Published Aug 18, 2017, 9:04 PM IST
Highlights
  • విజయవాడ నుండి నంద్యాలకు వస్తున్న ఓ వాహన వ్యవహారం తాజాగా సంచలనం రేపుతోంది.
  • విజయవాడ నుండి శుక్రవారం రాత్రి నంద్యాలకు ఓ వాహనం బయలుదేరింది.
  • ఆ వాహనంపై ‘సిఎం ప్యాంట్రీ వెహికల్’, పోలీసు వాహనం అని రాసివుంది.
  • నంద్యాలకు సమీపంలోని గాజులపల్లెమిట్ట వద్దకు రాగానే  హటాత్తుగా ప్యాంట్రీ వాహనం ఆగిపోయింది.
  • విజయవాడ వైపు నుండి ఏదో వాహనం వస్తోందన్న సమాచారంతో ఎన్నికల పరిశీలకులు సదరు వాహనాన్ని నిలపటంతో ప్యాంట్రీ వాహనం ఆగింది.

విజయవాడ నుండి నంద్యాలకు వస్తున్న ఓ వాహన వ్యవహారం తాజాగా సంచలనం రేపుతోంది. ఉపఎన్నికలో గెలుపుకోసం ఇటు టిడిపి అటు వైసీపీలో తీవ్రంగా పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరో ఐదు రోజుల్లో పోలింగ్ ఉంది. శుక్రవారం ఉదయం నుండి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, ఉపఎన్నికను వాయిదా వేయించేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందంటూ పదేపదే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో వైసీపీ శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేస్తోందని ఆరోపణలు చేస్తున్నారు.

అటువంటి నేపధ్యంలోనే విజయవాడ నుండి శుక్రవారం రాత్రి నంద్యాలకు ఓ వాహనం బయలుదేరింది. ఆ వాహనంపై ‘సిఎం ప్యాంట్రీ వెహికల్’, పోలీసు వాహనం అని రాసివుంది. నంద్యాలకు సమీపంలోని గాజులపల్లెమిట్ట వద్దకు రాగానే  హటాత్తుగా ప్యాంట్రీ వాహనం ఆగిపోయింది. విజయవాడ వైపు నుండి ఏదో వాహనం వస్తోందన్న సమాచారంతో ఎన్నికల పరిశీలకులు సదరు వాహనాన్ని నిలపటంతో ప్యాంట్రీ వాహనం ఆగింది.

వాహనంలో నుండి డ్రైవర్, సెక్యూరిటీగా ఉన్న పోలీసులు దిగారు. వాహానాన్ని ఓపెన్ చేయమని పరిశీలకులు ఆదేశించారు. అయితే, ఆ ఆదేశాలను డ్రైవర్ పాటించలేదు. ఎందుకంటే, ముఖ్యమంత్రి ప్యాంట్రీ వాహనం కాబట్టి తెరిచేందుకు లేదని డ్రైవర్ చెప్పారు. దాంతో పరిశీలకులకు అనుమానం వచ్చింది. దాంతో వాహనం తెరవాల్సిందేనంటూ గట్టిగా చెప్పారు. అయినా డ్రైవర్ అంగీకరించలేదు. పైగా డ్రైవర్ తో పాటు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా పరిశీలకుని మాటలకు అడ్డుచెప్పారు.

ఇంతలో వైసీపీ కార్యకర్తలకు ఆ విషయం తెలియటంతో అక్కడికి చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత మొదలైంది. అదేసమయంలో విషయం టిడిపికి నేతలకూ చేరింది. ఇంకేముంది, ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. పరిశీలకుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండానే వాహనాన్ని నంద్యాలలోని ఆర్డీఓ కార్యాలయానికి తరలించారు. వాహనంలో సుమారు  రూ. 100 కోట్లు ఉందని ప్రచారమైతే జరుగుతోంది. మొత్తానికి ప్యాంట్రీ వ్యవహారం ఏ ములుపు తిరుగుతుందో చూడాలి.

click me!