చంద్ర‌బాబు ఓ అఘోరా..

Published : Aug 18, 2017, 07:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
చంద్ర‌బాబు ఓ అఘోరా..

సారాంశం

చంద్రబాబు నాయుడు ఓ పొలిటికల్‌ అఘోర. చంద్ర‌బాబుకు నైతిక‌ విలువ‌లు లేవు. బాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నేరవేర్చలేదని ఎద్దేవా

ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఓ పొలిటికల్‌ అఘోర అంటు విర్శించారు వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి. చంద్ర‌బాబుకు నైతిక‌ విలువ‌లు లేవ‌ని, ప్ర‌లోబాలతో రాజ‌కీయాలు చేయ‌డ‌మే బాబు నైజంగా ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.  శుక్ర‌వారం నంద్యాల్లో వైసీపి నేత‌లు చంద్ర‌బాబు పై విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించారు.
  
ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్ర‌బాబు నెర‌వేర్చ‌లేద‌ని ఆరోపించారు శ్రీధ‌ర్ రెడ్డి. సీఎంకు గుణపాఠం చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు 2019 దాకా ఆగాల్సిన అవ‌స‌రం లేదని, నంద్యాల ఉప ఎన్నిక రూపంలో ముందే వ‌చ్చింద‌న్నారు. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపికి ఓటు వేసి చంద్ర‌బాబుకు త‌గిన‌ బుద్ది చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. చంద్ర‌బాబు అవినీతి త‌ప్ప ప్ర‌జా పాల‌న ప‌ట్ట‌ద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. 

మ‌రో వైసీపి ఎమ్మెల్యే రాచమల్లు ప్ర‌సాద రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వెయ్యాలో టీడీపీ నాయ‌కులు తెల‌పాల‌ని డిమాండ్ చేశారు.  ఓట్లెయమని అడిగేముందు ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. మూడున్న‌రేళ్లుగా ఇచ్చిన హామీలు అమ‌లు చేసి ఉంటే నేడు క్యాబినేట్‌ అంతా రోడ్డు మీద ప‌డేది కాద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్